నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్టు 29 వ తేదీన ఈ సినిమా థియేటర్లో విడుదల అయింది. ఈ మూవీ కి మొదటి నుండే మంచి కలెక్షన్లు వచ్చాయి. ఇక రెండు వారాల పాటు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హోల్డ్ ను కనబరిచింది. ఇక తాజాగా ఈ సినిమా మూడవ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మూడవ వారం స్టార్టింగ్ నుండే ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కష్టాలు ఎదురవుతున్నాయి. కాస్త తక్కువ కలెక్షన్లు ఈ మూవీ కి మూడవ వారం నుండి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 15 రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

15 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 13.95 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 3.64 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.74 కోట్లు , ఈస్ట్ లో 1.96 కోట్లు , వెస్ట్ లో 1.43 కోట్లు , గుంటూరులో 1.80 కోట్లు , కృష్ణ లో 1.79 కోట్లు , నెల్లూరు లో 1.22 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 15 రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 29.53 కోట్ల షేర్ , 49.30 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి 15 రోజుల్లో కర్ణాటక , తమిళనాడు మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 6.93 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్సీస్ లో 12.10 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా 15 రోజులకు గాను ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 48.56 కోట్ల షేర్ , 89.95 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 41 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ఫార్మన్ కంప్లీట్ చేసుకుని 6.56 కోట్ల లాభాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: