తమిళ నటుడు తలపతి విజయ్ హీరోగా రూపొందిన ది గోట్ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాకు తమిళనాడు , ఓవర్సీస్ లో మినహాయిస్తే మిగతా ప్రాంతాల్లో పెద్దగా కలెక్షన్ రావడం లేదు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ఎనిమిది రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ ఎనిమిది రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో తెలుసుకుందాం.

మూవీ కి 8 రోజుల్లో తమిళ నాడు ఏరియాలో 145.10 కోట్ల కలెక్షన్లు రాగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11.85 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. కర్ణాటక ఏరియాలో 24 కోట్ల కలెక్షన్లు రాగా , కేరళ ఏరియాలో 12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు 17.85 కోట్ల కలెక్షన్లు రాగా , ఓవర్ సీస్ లో 131.20 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ మూవీ కి 8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 167.20 కోట్ల షేర్ ... 342 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 185 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 187 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ ఫార్ములా అండ్ కంప్లీట్ చేసుకొని హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే మరో 19.80 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టవలసి ఉంది. ఇకపోతే ఈ సినిమాకు తమిళనాడు ఏరియాలో 76 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఓవర్సీస్ లో 55 కోట్ల ప్రి రిలీజ్ చేసిన జరిగింది. ఈ రెండు ఏరియాలలో ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: