యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర మొదటి భాగంలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా ... బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ యొక్క మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. ఇకపోతే ఈ మూవీ బృందం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన కొంత మంది యంగ్ హీరోలను కూడా ఈ సినిమా ప్రచారాలకు బాగా వాడుకుంటుంది. అసలు విషయం లోకి వెళితే ... తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటులు అయినటువంటి విశ్వక్ సేన్ , సిద్దు జొన్నలగడ్డ ను కూడా ఈ మూవీ ప్రచారాలలోకి ఈ మూవీ బృందం రంగంలోకి దించింది. ఈ ఇద్దరు కుర్ర హీరోలతో జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ ఇంటర్వ్యూ ను నిర్వహించారు.

ఇందుకు సంబంధించిన షూటింగ్ కూడా తాజాగా పూర్తి అయింది. మరో ఒకటి , రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన వీడియో బయటకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా దేవర మూవీ యూనిట్ అద్భుతమైన స్థాయిలో ప్రచారాలను ముందుకు తీసుకు వెళుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను ఈ మూవీ బృందం విడుదల చేయగా దానికి మంచి రెస్పాండ్ జనాల నుండి లభించింది. ఇకపోతే ప్రస్తుతానికి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: