తెలుగు సినీ పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల మధ్యలో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ ఇలియానా కూడా ఒకరు.. మొదట దేవదాసు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన నటించి భారీ విజయాలను అందుకుంది.. అలా తక్కువ సమయంలోనే భారీ రెమ్యూనరేషన్ అందుకుంది. స్టార్ డం వచ్చిన సమయంలో బాలీవుడ్ వైపుగా వెళ్లి అక్కడ పలు సినిమాలలో నటించిన ఫెయిల్యూర్ హీరోయిన్గా మిగిలిపోయింది.
టాలీవుడ్ లో అప్పటి హీరోయిన్లలో కోటి రూపాయలు అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్లు ఇలియానా కూడా ఒకరు. బాలీవుడ్ కు వెళ్లిన సమయంలో తెలుగు పరిశ్రమకు కొత్త హీరోయిన్లు రావడంతో ఇలియానాకు టాలీవుడ్ లో ఆఫర్లు కరువయ్యాయి. అలా ఇండస్ట్రీ నుంచి మాయమైపోయింది ఇలియానా. అయితే ఇలియానా తల్లి కూడా ఒక నటీ అనే విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. ఇలియానా తల్లి పేరు సమీరా డిక్రూజ్.. ఈమె ఒక చిత్రంలో గెస్ట్ పాత్రలో కనిపించిందట.
గతంలో సురేందర్ రెడ్డి, రవితేజ కాంబినేషన్లో వచ్చిన కిక్ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే.. అయితే ఈ చిత్రంలో సెకండ్ హాఫ్ లో ఒక కామెడీ సన్నివేశంలో హీరోయిన్ ఇలియానా తల్లి సమీరా డీక్రుజ్ కనిపించిందట. జిగురు జింగానీయా అంటూ బ్రహ్మానందాన్ని కలుస్తుందో ఆమె ఇలియానా అమ్మ గారే నట.. అయితే ఈ విషయం విన్న ఇలియానా అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఇది ఆయన ఎక్కడికి వెళ్లినా సరే కచ్చితంగా ఆమె వెంట తన తల్లిని కూడా తీసుకొని వెళ్తూ ఉండేది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఇలియానా ప్రస్తుతం అవకాశాలు కనుమరుగయ్యాయి. ఇటీ వలె ఒక మగ బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఇలియానా.