మెగాస్టార్ చిరంజీవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడమే కాదు. ఇండస్ట్రీలోకి వచ్చి రాణించాలని ఎంతోమంది యువకులకు ఒక రోల్ మోడల్ గా మారిపోయారు అని చెప్పాలి. ఇక చిరంజీవిని చూస్తే ఎంతోమంది ఇప్పటివరకు ఇండస్ట్రీలోకి వచ్చిన వారు ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించిన చిరంజీవి ఎంతో హీరోయిన్లతో రొమాన్స్ చేశారు.


 అయితే హీరోలు ఇలా ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించినప్పటికీ నటించినప్పటికీ ఇక వారి కంటూ ఫేవరెట్ హీరోయిన్ ఒకరు ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా కొన్ని కొన్ని సార్లు ఇంటర్వ్యూలలో ఆయా హీరోలకు మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న ఎదురైతే.. ఇక తమ ఫేవరెట్ ఎవరు అనే విషయాన్ని చెప్పడం.. అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పటివరకు ఏకంగా ఎంతో మంది హీరోయిన్లతో కలిసి నటించిన మెగాస్టార్ చిరంజీవికి.. ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని తెలుసుకోవడానికి అందరూ తెగ ఆసక్తిని కనబడుతూ ఉంటారు.


 అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై సమాధానం చెప్పాడు. నేను నటించిన హీరోయిన్స్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీకి నేను అభిమానిని. హీరోయిన్స్ ఒక్కొక్కరు ఒక్కో విషయంలో నిశ్చితులు. రాధ గురించి చెప్పాలంటే డాన్స్ అద్భుతంగా చేస్తుంది. శ్రీదేవి ఓవరాల్ పర్సనాలిటీ పరంగా గొప్పవారు. సుమలత హోమ్లి రోల్ కి పెట్టింది పేరు. సుహాసిని మరో కోణంలో గొప్ప. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కో క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ కి నేను దాసోహం. అయితే సావిత్రి జయసుధ వాణి శ్రీ తర్వాత విలక్షణత కలిగి ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రాధిక. ఆమె ఎమోషన్స్ కామెడీ క్లాస్ మాస్ అన్ని రకాల పాత్రలు చేయగలదు. అందుకే నాకు ఇష్టమైన హీరోయిన్ రాధిక అంటూ చిరంజీవి చెపుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: