తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు. కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతలు కొన్ని సందర్భాలలో అనుకొని నిర్ణయాలు తీసుకోవడం వల్ల స్టార్ పొజిషన్లోకి హీరో, హీరోయిన్స్ మారుతూ ఉంటారు. తెలుగు సినీ పరిశ్రమలో లెజెండ్ నిర్మాతగా పేరు పొందిన రామానాయుడు కూడా ఒక స్టార్ హీరోయిన్ ని పరిచయం చేసిన.. ఆమె ఓ హీరో చేసిన మోసానికి కెరియర్ లో ఒక్కసారిగా పాతాళానికి వెళ్ళిపోయిందట. ఇక హీరోయిన్ ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
పంజాబీ ప్రాంతానికి చెందిన హీరోయిన్ నికిత ముంబైలో నివసిస్తూ ఉండేది. ఇమే ఒక హోటల్లో డిన్నర్ చేస్తూ ఉండగా రామానాయుడు కళ్ళల్లో పడడంతో ఆమె అందాన్ని చూసి ఆమెను హీరోయిన్ గా చేయాలని ఫిక్స్ అయ్యి ఆమెతో మాట్లాడి ఒక సినిమాలో ఆఫర్ ఇప్పించారట. దీంతో తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా నికిత అంగీకరించి ఓకే చెప్పింది. ఆ సినిమా ఏదో కాదు హాయ్.. ఈ సినిమా తర్వాత ఈమె నటించిన చిత్రాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి.
అలా తమిళ్ కన్నడ వంటి భాషలలో కూడా నటించి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. హాయ్ సినిమా తర్వాత మలయాళం లో ఎన్నో చిత్రాలు నటించిన నికిత తెలుగులో సంబరం సినిమాలో కూడా నటించింది. అలాగే సరోజ అనే సినిమాలో నటించిన ఈమె దక్షిణాది సినీ పరిశ్రమలోనే స్టార్ హీరోయిన్ హోదా అని అందుకున్నది.. నికిత తమిళ్, తెలుగు కన్నడ, మలయాళం భాషలలో బిజీ హీరోయిన్గా మారుతున్న సమయంలో పెళ్లయిన కన్నడ హీరో దర్శిన్ తో రిలేషన్ పెట్టుకోవడం వల్ల ఈమె కెరియర్ నాశనం అయ్యిందనే విధంగా ఇప్పటికీ వార్తలు వినిపిస్తుంటాయి. ఈ అక్రమ సంబంధం హీరో భార్య విజయలక్ష్మి కి తెలిసి నికిత పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట. దీంతో ఈమెను మూడేళ్ల పాటు సినీ పరిశ్రమ నిషేధించిందనీ సమాచారం.అలా కెరియర్ నాశనం అవ్వడంతో ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సినీ ఇండస్ట్రీకి దూరంగా మారిపోయింది.