మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న హై ఆక్టెన్ యాక్షన్ పాన్ ఇండియా ఎంటర్టైనర్ దేవర. సెప్టెంబర్ 27 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్లలో వేగం పెంచారు.రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. మరో 10-15 రోజుల పాటు ప్రమోషన్ల పరంగా దేవర మాస్ ఫెస్ట్ జరగబోతోంది. సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తుండడంతో అన్నీ భాషల్లోనూ ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేశారు మేకర్స్. అందులో ఎన్టీఆర్ కూడా పాల్గొనబోతుండడం విశేషం.ఈ నేపథ్యంలోనే దేవర క్రేజ్ రోజు రోజుకి పిక్స్ కు చేరుకుంటుంది. ఇదిలా ఉంటే చిత్ర యూనిట్ వినూత్నంగా ప్రమోషన్స్ చేస్తుంది. తాజాగా ముంబైలోని దాదర్ చౌపటి బీచ్ వద్ద సముద్రంలో భారీ దేవర కటౌట్ ఏర్పాటు చేసింది. గణేష్ నిమజ్జనం చేసేటప్పుడు ఈ కటౌట్ చూడవచ్చని దేవర టీం పోస్ట్ చేసింది. ఇదిలావుండగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ ఇండియాను ఆల్రెడీ దేవర ఫీవర్ కమ్మేసింది. అసలు ఈ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు.ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, మూడు పాటలు సినీ లవర్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేవు.కేవలం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు యావత్ తెలుగు ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న మూవీ 'దేవర'.దానికి తోడు ఆర్ఆర్ఆర్ వంటి అరివీర భయంకర హిట్టు తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ అమితాసక్తి నెలకొంది.
 ఇక రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ అరాచాకానికి అసలు సిసలైన మీనింగ్‌ తెలిపేలా ఉంది. తారక్ ఫ్యాన్స్ ఇంకా ఆ ట్రాన్స్‌లో నుంచి బయటకు రాలేకపోతున్నారు. కొరటాల మాత్రం ట్రైలర్‌ను మాములుగా కట్ చేయలేదు.రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ'. 'మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు.. చంపేంత కాదు. కాదూ కూడదు మళ్లీ ఆ ధైర్యాన్ని కూలదడితే.. ఆ ధైర్యాన్ని సంపి భయాన్నైతా' వంటి డైలాగ్‌లు ఓ రేంజ్‌లో అంచనాలు క్రియేట్ చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: