కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో తళపతి విజయ్ ఒకరు. ఈయన తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గోట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటించాడు. ఈ మూవీ లో విజయ్ ఒక పాత్రలో తండ్రిగానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించాడు. ఇక ఈ సినిమాలో తండ్రి పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా సీనియర్ నటి స్నేహ నటించగా , కొడుకు పాత్రలో నటించిన విజయ్ కి జోడిగా మీనాక్షి చౌదరి నటించింది. సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు తమిళనాడు , ఓవర్సీస్ లో భారీ ఎత్తున కలెక్షన్లు దక్కుతున్నాయి.

మిగతా ప్రాంతాల్లో పెద్ద స్థాయి కలెక్షన్లు రావడం లేదు. ఇక ఈ రెండు ఏరియాలలో వస్తున్న కలెక్షన్లతోనే ఈ మూవీ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ ఫార్ములా కు దగ్గరగా వచ్చేసింది. మరో కొన్ని రోజుల్లోనే ఈ సినిమా హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే విజయ్ ఓ రాజకీయ పార్టీని స్థాపించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్నికలకు వెళ్లే ముందు విజయ్ ఆఖరుగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. మరికొన్ని రోజుల్లోనే విజయ్ , హెచ్ వినోద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయన మూవీలకు దూరం అయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.

ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫైనల్ అవుతుంది. ఈ సినిమాలో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. దానితో చాలా మంది విజయ్ , పూజా హెగ్డే కాంబోలో రూపొందిన బీస్ట్ మూవీ ఫ్లాప్ అయ్యింది. అలాగే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో నటించిన సినిమాలు కూడా చాలా వరకు బోల్తా కొట్టాయి. దానితో ఈ బ్యూటీ ని కాకుండా వేరే బ్యూటీ ని హీరోయిన్గా తీసుకుంటే బాగుంటుంది అని పలువురు విజయ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: