‘కల్కి’ మూవీతో ప్రభాస్ మళ్ళీ 1000 కోట్ల హీరోగా మారిపోవడంతో ఆ ఒత్తిడి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై చాల తీవ్రంగా ఉండి అన్న చర్చలు నడుస్తున్నాయి. 6 సంవత్సరాల క్రితం విడుదలైన ‘అరవింద సమేత’ తరువాత జూనియర్ సోలో హీరోగా వస్తున్న మూవీ ‘దేవర’ మధ్యలో వచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ 13 వందల కోట్లకు పైగా కలెక్ట్ చేసినప్పటికీ ఆ క్రెడిట్ జూనియర్ రామ్ చరణ్ రాజమౌళిలతో పంచుకోవలసి వచ్చింది.
తారక్ కెరియర్ లో ఇప్పటి వరకు 1000 కోట్లు కలక్షన్స్ రాబట్టిన సినిమా ఒక్కటి కూడ లేదు. ఆ లోటు ‘దేవర’ తీరుస్తుందని జూనియర్ అభిమానులు భావిస్తే లేటెస్ట్ గా విడుదలైన ‘దేవర’ మూవీ ట్రైలర్ పూర్తిగా తారక్ అభమానులకు సంతృప్తికరంగా లేదు అన్న ప్రచారం జరుగుతోంది. దీనికితోడు మీడియాలో కూడ ‘దేవర’ అంచనాలను పూర్తిగా అందుకోలేదా అంటూ చర్చలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ఈ సినిమా విడుదల అవుతున్న సెప్టెంబర్ 27 తరువాత రెండు వారాల గ్యాప్ తరువాత మాత్రమే దసరా పండుగ వస్తుంది. ఆసమయానికి ‘దేవర’ వేడి తగ్గిపోతుంది. దీనితో దసరా సీజన్ కు సరైన తెలుగు భారీ సినిమా లేకుండా పోయిందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో ‘దేవర’ రాంగ్ టైమ్ లో రిలీజ్ అవుతోందా అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు.
‘దేవర’ ట్రైలర్ లో ‘ఆచార్య’ మూవీ ఛాయలు కనిపించడం కథ రొటీన్ గా అనిపించడంతో ఒక్కసారిగా ‘దేవర’ పై అంచనాలు తగ్గిపోయాయి. దీనితో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ కలక్షన్స్ విషయంలో చరిత్ర సృష్టించడం అంత సులువు కాదు అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ప్రారంభం సమయంలో నిర్మాత కళ్యాణ్ రామ్ ‘దేవర’ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ స్థాయిలో ఉంటుంది అన్న కామెంట్స్ చేయడంతో ఆ రేంజ్ లో ఈ మూవీ ట్రైలర్ లేదు అంటూ మరికొందరు కామెంట్స్ చేయడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..