సినిమా ఇండస్ట్రీలో కెరీర్లు చాలా సంవత్సరాలు ముందుకు సాగించాలి అంటే ఏ సినిమాలో నటించాలి అనేది కాదు ... ఏ సినిమాలను రిజెక్ట్ చేయాలి అనే విషయం కూడా చాలా వరకు తెలిసి ఉండాలి. ఆ మూవీ ని వదిలి పెట్టాలో తెలిస్తే ఫ్లాప్ మూవీ ల నుండి తప్పించుకొని కెరీర్ ను చాలా సాఫీగా , చాలా సంవత్సరాల పాటు ముందుకు సాగించవచ్చు. ఈ విషయంలో రష్మిక మందన చాలా తెలివిగా కెరీర్ ను ముందుకు దూసుకుపోతుంది. అసలు విషయంలోకి వెళితే ... ఈ బ్యూటీ ఓ రెండు సినిమాల నుండి తెలివిగా తప్పించుకోగా , ఆ రెండు సినిమాలనే పూజ హెగ్డే ఓకే చేసి భారీ అపజయాలను అందుకుంది. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ సినిమాలో చరణ్ కి జోడిగా పూజా హెగ్డే నటించింది. ఈ సినిమాలో పూజా హెగ్డే పాత్ర కోసం మొదట రష్మిక మందన ను సంప్రదించగా ... ఈమె ఆ పాత్రను రిజెక్ట్ చేయడంతో పూజా హెగ్డే ను ఈ సినిమాలో చరణ్ కి జోడిగా తీసుకున్నారు. ఇక ఈ సినిమా భారీ ఫ్లాప్ ను అందుకుంది. ఈ సినిమా ద్వారా పూజ హెగ్డే కు ఎలాంటి గుర్తింపు రాలేదు.

కొంత కాలం క్రితం తమిళ నటుడు విజయ్ , నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో హీరోయిన్ అవకాశం మొదటగా రష్మిక కే వచ్చిందంట. కానీ ఈమె కొన్ని కారణాల వల్ల ఈ సినిమాలో నటించకపోవడంతో , ఆ తర్వాత పూజ హెగ్డే ను ఈ మూవీ బృందం వారు హీరోయిన్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక రష్మిక తెలివిగా ఆచార్య , బీస్ట్ మూవీ ల నుండి తప్పించుకుంటే ఆ రెండు సినిమాలను పూజా హెగ్డే ఓకే చేసి భారీ అపజయాలను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: