టాలీవుడ్ కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో రాజేంద్రప్రసాద్ పేరు మొట్టమొదటిగా వినిపిస్తుంది.ఈయన తన సినిమాలతో ఎంతోమందికి నవ్వు తెప్పించేవారు.అలా హాస్య హీరోగా ఇండస్ట్రీలో కొనసాగిన ఈయన ప్రస్తుతం సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే అలాంటి రాజేంద్రప్రసాద్ కి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదేంటంటే.. గతంలో రాజేంద్రప్రసాద్హీరోయిన్ ని ప్రేమించారని, పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని కొన్ని వార్తలు మీడియాలో కాదు పేపర్లలోనే ప్రచురితమయ్యాయి. ఇక ఆ హీరోయిన్ ఎవరు..నిజంగానే పెళ్ళి వరకు వెళ్లారా అనేది ఇప్పుడు చూద్దాం..రాజేంద్రప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే రూమర్స్ వచ్చిన హీరోయిన్ ఎవరో కాదు రజిని..

 సీనియర్ నటి రజిని రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో కొన్ని సినిమాలు రావడం కారణంగా వీరి మధ్య ఈ ప్రేమ వార్తలు పెళ్లి వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే గతంలో రాజేంద్ర ప్రసాద్ రజినిని గాఢంగా ప్రేమించాడని,కానీ కొన్ని కారణాలవల్ల వీరిద్దరి పెళ్లి కాలేదనే టాక్ వినిపించింది. కానీ ఇందులో అస్సలు నిజం లేదు అని రాజేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. రజిని మీద నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది.అలాగే మేమిద్దరం కలిసి ఎక్కువ సినిమాల్లో నటించడం వల్లే ఈ రూమర్స్ వచ్చాయి.

 అసలు నాకు రజిని మీద అలాంటి ఉద్దేశం కూడా లేదు. వార్త పత్రికల్లో వచ్చిన మా పెళ్లి వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ రాజేంద్రప్రసాద్ కొట్టి పారేశారు. ఇక ఇదే విషయంపై రజిని ఓ ఇంటర్వ్యూలో చెబుతూ..నేను హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను. కాబట్టి రాజేంద్రప్రసాద్ నన్ను ఎక్కువగా ఇష్టపడతారు.మా ఇద్దరి మధ్య చెడు రిలేషన్ ఏమీ లేదు. పెళ్లి వార్తలు అవాస్తవమే అంటూ కొట్టు పారేసింది. కానీ ఇండస్ట్రీలోని కొంతమంది జనాలు మాత్రం రజిని, రాజేంద్రప్రసాద్  లు ఇద్దరు గాఢంగా ప్రేమించుకున్నారని, కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేదని అంటుంటారు

మరింత సమాచారం తెలుసుకోండి: