ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత మీనాక్షి , రవితేజ హీరోగా రూపొందిన కిలాడి సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ లో ఈ బ్యూటీ తన అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ ముద్దు గుమ్మకి అవకాశాలు మాత్రం భారీగా రాసాగాయి. 

ఇక ఈమెకు మొదటి విజయం తెలుగులో అడవి శేషు హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ మూవీ తో లభించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమాతో ఈ బ్యూటీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈమెకు ఈ సినిమాలో భారీ గుర్తింపు కలిగిన పాత్ర కూడా దక్కలేదు. కానీ ఉన్నంతలో ఆ సినిమాలో మీనాక్షి పర్వాలేదు అనిపించుకుంది. ఈ ముద్దు గుమ్మ తాజాగా తమిళ నటుడు విజయ్ హీరోగా రూపొందిన గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) అనే సినిమాలో హీరోగా హీరోయిన్గా నటించింది. ఈ మూవీ సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల థియేటర్లలో విడుదల అయ్యింది.

ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తున్న ఈ బ్యూటీ తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ శారీని కట్టుకొని , సిల్వర్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి క్యూట్ స్మైల్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: