బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బిగ్ బాస్ లో మెరిసిన ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకుంది..తన క్యూట్ వాయిస్ తో అరియనా యాంకర్ గా దూసుకుపోతోంది..బుల్లితెరపై వస్తున్న పలు షోలల్లో మెరుస్తుంది..ఇటీవల సోషల్ మీడియా లో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ తో జిమ్ వీడియోలు, ఇంటర్వ్యూలు చేయడంతో అరియనాకు ఫుల్ పబ్లిసిటీ లభించింది. దీనితో అరియనా సోషల్ మీడియా లో తెగ ట్రెండ్ అవుతుంది..గత ఏడాది అరియనా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇటీవల విడుదలైన రాజ్ తరుణ్ ‘అనుభవించు రాజా’ చిత్రం లో అరియనా స్పెషల్ రోల్ లో మెరిసింది. ఆమెకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం.. ఇక సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు వరుస ఫోటో షూట్ లతో రచ్చ రచ్చ చేస్తుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతుంది.తాజాగా మరోసారి తన గ్లామర్ తో కుర్రాళ్లకు గాలం వేసింది. ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ వీడియో ఒకటి చేసింది. తన స్నేహితుడు రోల్ రైడ్ లేటెస్ట్ ఆల్బమ్ కాకినాడ కాజా అనే సాంగ్ కు స్టెప్పులేసింది ఈ అమ్మడు. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంది. మాస్ స్టెప్పులతో అదరగొడుతుంది.ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో అరియానా మరింత అందంగా కనిపిస్తుంది.తన నడుము అందంతో చూపుతిప్పుకోకుండా చేసింది. కిల్లింగ్ లుక్స్ తో రెచ్చగొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారాయి.అరియానా షేర్ చేసిన ఈ అందమైన డాన్స్ వీడియో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కూడా ఎంతో ఫిదా అవుతున్నారు. లైక్స్ మరియు కామెంట్స్ తో తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: