కోలీవుడ్, టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా పేరుపొందిన రజనీకాంత్ దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో జైలర్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత సరైన కథలతో ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు రజినీకాంత్. రజనీకాంత్ కూలి సినిమాలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లేవల్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖలో జరుగుతూ ఉండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది వాటి గురించి చూద్దాం. డైరెక్టర్ లోకేష్ కనకరాజు తెరకెక్కిస్తున్నారు.


కూలి సినిమాకి సంబంధించి విశాఖలో సినిమా షూటింగ్ కంటైనర్ టెర్మినల్లో జరుగుతూ ఉండగా అగ్నిప్రమాదం చోటు చేసుకుందట.. చైనా నుంచి లిథియం బ్యాటరీలతో వచ్చిన కంటైనర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయాయి దీంతో పొగ మొత్తం రావడంతో పోర్టు కూడ అంటుకున్నదట.దీంతో వెంటనే సిబ్బంది రంగంలోకి దిగి మంటలను ఆర్పేశారట. ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగినట్లుగా సమాచారం. గత నెల 28వ తేదీన చైనా నుంచి వచ్చిన ఈ కంటైనర్ కోల్కతాకు వెళ్లాల్సి ఉండగా లోడ్ చేస్తున్న సమయంలో కొద్దిసేపటికి ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.


ఈ ఫైర్ యాక్సిడెంట్ గల కారణాలు ఏంటి అనే విషయంపై ఇంకా అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే అలా కంటైనర్ లో ప్రమాదం జరిగిన సమయంలోనే సినిమా షూటింగ్ జరుగుతోందట.ఈ అగ్నిప్రమాదం తర్వాత వెంటనే చిత్ర బృందం వెంటనే అక్కడి నుంచి రజినీకాంత్ ని తరలించినట్లుగా సమాచారం. దాదాపుగా 40 రోజులపాటు అక్కడే సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా అనూహ్యంగా  ప్రమాదం జరగడంతో సినిమా షూటింగ్స్ పార్టీని మార్చే అవకాశం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన చిత్ర బృందం ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి. ఇందులో బడా హీరోలు నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: