ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా మంది కమెడియన్స్ వున్నారు.. అయితే వారిందరిలో టాప్ కమెడియన్స్ గురించి చెప్పుకున్నట్లయితే అందులో సత్య పేరు కచ్చితంగా వినిపిస్తూ ఉంటుంది.పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ అదిరిపోయే డైలాగ్ డెలివరీ తో సత్య ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు..తాజాగా కీరవాణి తనయుడు శ్రీ సింహ, సత్య, ఫరియా అబ్దుల్లా మెయిన్ లీడ్ లో వచ్చిన మత్తు వదలరా 2 సినిమా ఫుల్ ఫన్ రైడ్ తో ప్రేక్షకుల్ని  ఎంతగానో మెప్పిస్తుంది.ముఖ్యంగా ఈ సినిమాలో సత్య కామెడీ టైమింగ్ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. సత్య తనదైన కామెడి స్టైల్ తో వన్ మ్యాన్ షో చేశాడు.సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు సత్య క్యారెక్టర్ నవ్విస్తూనే ఉంటుంది..2009లో సత్య నటుడిగా కెరియర్ స్టార్ట్ సత్యకి ఫస్ట్ బ్రేక్ రావడానికి నాలుగేళ్లు పట్టింది. 2013 లో వచ్చిన స్వామి రారా సినిమాతో కమెడియన్ గా సత్యకి కాస్త ఫేమ్ వచ్చింది. అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

గతంలో సునీల్ ఎలా అయితే తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడో ఇప్పుడు మళ్ళీ అదే స్థాయిలో కామెడీ ఉండటంతో టాలీవుడ్ కి మరో వింటేజ్ సునీల్ దొరికేసాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. సినిమాలో సత్య రోల్ ఉందంటే చాలు ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఎక్కువగా ఇష్టపడే ఆడియన్స్ థియేటర్స్ లో వాలిపోతున్నారు. అంతలా సత్య కామెడీ ప్రేక్షకులకు నచ్చేసింది..జబర్దస్త్ కమెడియన్స్ సైతం అవకాశాలు అందుకుంటున్న కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా వున్న వెన్నెల కిషోర్ కి దీటుగా సత్య కూడా స్టార్ కమెడియన్ గా టాలీవుడ్ లో ఇప్పుడు రేస్ లో దూసుకుపోతున్నాడు. స్టార్ హీరోల సినిమాలలో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. మరోవైపు కామెడీ కథలతో వచ్చే చిన్న సినిమాలకు కూడా సత్య ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: