గత కొంతకాలంగా హీరోయిన్స్ సైతం ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. అలా అందం, అభినయం ఉన్నప్పటికీ సినిమా అవకాశాలు వచ్చిన కలిసి రాలేకపోవడంతో టాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు మేఘా ఆకాష్. తెలుగులో నితిన్ నటించిన లై, చల్ మోహన్ రంగ వంటి చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో రెండు కూడ పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు.  తెలుగులో పెద్దగా వర్కౌట్ కాలేకపోయినా ఈ ముద్దుగుమ్మ తమిళంలో మాత్రం మంచి సినిమాలలో నటించింది.



అయితే తమిళంలో అన్నీ కూడా సెకండ్ హీరోయిన్గా అవకాశాలు రావడంతో ఇక హీరోయిన్గా నెట్టుకు రావడం కష్టమని భావించిన ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా పెళ్లి వార్తను చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.. విష్ణు అనే వ్యక్తిని ప్రేమించి మరి వివాహం చేసుకుంటోంది మేఘా ఆకాష్. అంతేకాకుండా ఎంగేజ్మెంట్ ఫోటోలను కూడా షేర్ చేసింది. త్వరలోనే పెళ్లికి సిద్ధమైనట్లుగా తెలియజేసిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా మెహందీ డే అని చాలా గ్రాండ్గా కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.


ఇక అభిమానులు ఈ విషయం తెలిసిన వెంటనే ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కొత్త జీవితం నీకు పూర్తిగా సంతోషాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం అంటే అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వివాహ తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. కానీ ఈమె ఇంట పెళ్లి సందడి అయితే కనిపిస్తున్నట్లు ఈ ఫోటోలలో చూస్తే అర్థమవుతోంది. మరి వివాహం తర్వాత ఈ ముద్దుగుమ్మ సినిమాలకు దూరమవుతుందా లేకపోతే కొనసాగిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉన్నది.. తెలుగులో ఈమె సినిమాలు సక్సెస్ కాలేకపోయినా అభిమానులను మాత్రం బాగానే సంపాదించుకుంది. మరి త్వరలోనే మేఘా ఆకాష్ వివాహ తేదీని ప్రకటిస్తుందేమో చూడాలి. ప్రస్తుతం వీరి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: