మామూలుగా డబ్బింగ్ సినిమాలకే టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. భారతీయుడు 2 సినిమాకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టికెట్ రేట్లు పెంచారు. అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాకు పెంచుకుండా ఉంటారా. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాకు కచ్చితంగా టికెట్ రేట్ల పెంపు ఉంటుంది. అయితే ఏ సినిమాకు లేనిది దేవర పైన ఈ టికెట్ రేట్ల పెంపు చర్చ ఎందుకు జరుగుతుంది అంటే.. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. చంద్రబాబుకు.. ఎన్టీఆర్‌కు మధ్య కొన్నేళ్ళుగా సరైన వాతావరణం లేదు. హరికృష్ణ మరణం తర్వాత ఈ దూరం మరింత పెరిగిందని అంటున్నారు.


పైగా భువనేశ్వరి ఎపిసోడ్ విషయంలో తారక్‌ స్పందించిన తీరు చాలామందికి నచ్చలేదు. దీనికి తోడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జై ఎన్టీఆర్ అంటూ.. బాబు, లొకేష్‌ను.. ఎన్టీఆర్ అభిమానులు ఇబ్బంది పెట్టిన ఘటనలు.. చంద్రబాబు సీరియస్ అయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాకు టికెట్లు పెంపు కోసం చంద్రబాబు సర్కారు ప్రత్యేక అనుమతి ఇస్తుందా..? ఇస్తే ఏ స్థాయిలో ఇస్తుంది..? అనే సరికొత్త చర్చ ఇప్పుడు తెరమీదకు వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్కి సినిమాకు టికెట్ రేట్లు పెంచుకున్నారు.


అయితే అక్కడ అశ్విని చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. దేవర యూనిట్లో అలాంటి సన్నిహితులు ఎవరు కనిపించడం లేదు. మరి ఇప్పుడు దేవర సినిమాకు టికెట్ రేట్లు పెంచే విషయంలో.. దేవర యూనిట్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎవరు చర్చిస్తారు అన్నది కూడా చూడాలి. అయితే ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ దేవర టిక్కెట్ల పెంపు కోసం అనుమతులు వచ్చేసాయి అన్న మరో ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్స్‌లు 325 ... సింగిల్ స్క్రీన్ లలో 200 టికెట్ రేట్లుగా ఫిక్స్ చేశారంటూ నెంబర్లు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇదే నిజమైతే దేవరకు ఎలాంటి ఇబ్బంది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: