టాలీవుడ్‌లో రాను.. రాను.. ఓ వేలం వెర్రి ధోర‌ణి బాగా ముదురుతోంది. ప్రాజెక్టులు చేసేయాలనే తపనతో హీరోలను పోషించడం పెరిగిపోతుంది. హీరోల రెమ్యూనరేషన్లు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పుడు కనీసం ఐదు కోట్లు పెట్టకుండా చిన్న హీరో కూడా సినిమా చేయటం లేదు. చిన్న చిన్న  హీరోలు సైతం భారీ రెమ్యూనరేషన్ ఇస్తేనే రంగంలోకి దిగుతున్నారు. కానీ విచిత్రం ఏంటంటే చాలామంది హీరోల రెమ్యూనరేషన్లు సరిపడా కూడా థియేటర్ కలెక్షన్లు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్, సీడెడ్‌, తెలంగాణ కలిపి పాతిక కోట్లకు పైగా థియేటర్ హక్కులు అమ్ముడు పోని హీరోల పేర్లను ఒక చేతి వేళ్ల‌ మీద లెక్కపెట్టవచ్చు.


టాలీవుడ్ లో ప్రస్తుతం చాలా ప్రామిసింగ్ హీరో అని చెప్పుకుంటున్న నాని తెలుగు రాష్ట్రాల థియేటర్ల హక్కులు పాతిక కోట్లు మాత్రమే. అవి కూడా రావటం లేదు. ఎంత మంచిటాక్‌ వచ్చినా రు. 25 కోట్లు రాని ప‌రిస్థితి .. నాని రెమ్యూనరేషన్ ప్రస్తుతం రూ.35 కోట్లు అని టాక్. రవితేజ రెమ్యూనరేషన్ రూ.25 కోట్లు. థియేటర్ మార్కెట్ రూ.20 కోట్లు కూడా లేదు. అయినా అది కూడా వసూలు కావటం లేదు. చాలామంది రూ.10 కోట్లు తీసుకున్న హీరోలు ఉన్నారు. వీళ్ళ థియేటర్ మార్కెట్ వసూలు ఏడెనిమిది కోట్లు కూడా పొందటం లేదు. ఉండటం లేదు. కేవలం నాన్ థియెట్రిక‌ల్‌ మార్కెట్ చూపించి ఈ హీరోలు రెమ్యూనరేషన్ లాగిస్తున్నారు.


మార్కెట్ కూడా ఇటు రెమ్యూనరేషన్లకు.. అటు నిర్మాణానికి సరిపోవటం లేదు. దీంతో థియేటర్ల మీద నుంచి వచ్చింది కూడా పెట్టాల్సి వస్తుంది. ఇక నిర్మాతకు నష్టాలు తప్ప ఏం మిగలడం లేదు. ఇవన్నీ తెలిసి కూడా నిర్మాతలు పోటీపడి మరి రెమ్యూనరేషన్ ఇచ్చి హీరోల డేట్లు తీసుకుంటున్నారు. నిర్మాతలు పోటీ పడటం వల్ల హీరోల రెమ్యునరేషన్లు పెరుగుతూ పోతున్నాయి. దీంతో వరుస ఫ్లాపులు వస్తున్న నిర్మాతలు కుదేలు అయిపోతున్నా.. కోట్లకు కోట్లు నష్టపోతున్న.. ఈ రేంజ్ రెమ్యున‌రేష‌న్‌ మాత్రం తగ్గించడం లేదు. చాలామంది హీరోలు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం అనుకుని నిర్మాతలను కుదేలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: