టాలీవుడ్ సినీ ప్రేక్షకులు.. అటు నందమూరి అభిమానులు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దేవర సినిమా.. మరో రెండు వారాలలో ప్రేక్షకులు ముందుకు రానుంది. త్రిపుల్ ఆర్ లాంటి భారీ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తర్వాత.. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై కనివిని ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ను ఇప్పటికే చూసి రెండున్నర సంవత్సరాలు అవుతుంది. దీంతో నందమూరి ఎన్టీఆర్ అభిమానులు అయితే దేవర సినిమా కోసం ఆకలితో అలమటిస్తున్న వారిలా ఎదురుచూస్తున్నారు.


ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట‌ర్‌గా.. కంప్లీట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్.. టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలు బాగా పెంచేశాయి. ఈ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే ఈ సినిమా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా ? అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. దేవర సినిమాపై ఓవర్సీస్ ఆడియన్స్‌లో సాలిడ్ అంచనాలు క్రియేట్ అయ్యాయి. కనీసం ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే నార్త్ అమెరికాలో దేవర ఫ్రీ సేల్స్ వసూళ్లు వన్ మిలియన్ డాలర్లను క్రాస్ చేసేసాయి. ఈ క్రమంలోని రిలీజ్ కి ముందే దేవర నార్త్ అమెరికాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.


సినిమా ప్రీమియర్స్ కి మరో 13 రోజులు టైం మిగిలి ఉండగానే.. ఈ ఏకంగా 40 వేలకు పైగా ఫ్రీ సేల్స్ టిక్కెట్లు అమ్ముడుపోయాయి. అంటే ఓవర్సీస్ లో దేవర సినిమాపై ఏ రేంజ్ లో బ‌జ్‌ ఉందో తెలుస్తోంది. ఇప్పటికే మిలియన్ డాలర్ మార్క్‌ క్రాస్ చేసిన దేవర.. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ టైం కు రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు దాటేసి.. దాదాపు మూడు మిలియన్ డాలర్లకు చేరువ‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఆచార్య లాంటి డిజాస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ చాలా కష్టంతో దేవర సినిమాను తెర‌క్కించారు. రెండు పార్ట్‌లుగా వస్తున్న దేవర సినిమా.. పార్ట్ వన్ ఈనెల 27న రిలీజ్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: