డాన్స్ కొరియోగ్రాఫర్ గా కెరియర్ను మొదలు పెట్టిన రాఘవ లారెన్స్ అద్భుతమైన స్థాయిలో గుర్తింపును సంపాదించుకొని తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలకు డాన్స్ కొరియో గ్రాఫర్ గా వ్యవహరించాడు. అలా డాన్స్ కొరియోగ్రాఫర్ గా అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్న సమయంలోనే రాఘవ లారెన్స్ దర్శకత్వం వైపు ఆ తర్వాత నటనబ్వైపు ఆసక్తిని చూపించడం మొదలు పెట్టాడు. ఇక డాన్స్ కొరియో గ్రాఫర్ గా రాఘవ లారెన్స్ ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడో దర్శకుడిగా , నటుడిగా కూడా అదే రేంజ్ లోనే సక్సెస్ అయ్యాడు.

ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం రాఘవ లారెన్స్ ఎక్కువ శాతం సినిమా పాటలకు డాన్స్ కొరియో గ్రఫీ చేయడం , దర్శకత్వం చేయడం కంటే కూడా నటించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తున్నాడు. అందులో భాగంగా వరుస సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే రాఘవ లారెన్స్ తన తదుపరి మూవీ ని తెలుగు దర్శకుడితో చేయబోతున్నాడు. ఇప్పటి వరకు రాఘవ లారెన్స్ తన కెరియర్ లో ఏ తెలుగు సినిమాలో కూడా హీరోగా నటించలేదు. ఇకపోతే ఈయన తన తదుపరి మూవీ ని వీర , కిలాడి సినిమాల దర్శకుడు అయినటువంటి రమేష్ వర్మ తో చేయబోతున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే రమేష్ వర్మ కొంత కాలం క్రితం రాక్షసుడు సినిమాకు దర్శకత్వం వహించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆఖరుగా ఈ దర్శకుడు కిలాడి సినిమాకు దర్శకత్వం వహించక. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇకపోతే రాఘవ లారెన్స్ తో ఈ దర్శకుడు తన తదుపరి మూవీ ని చేయబోతున్నాడు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా నిలబడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు బిగ్ యాక్షన్ అడ్వెంచర్ బిగిన్స్ అని తెలియజేస్తూ పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: