ముఖ్యంగా పాటల్లోని అక్కినేని నృత్యాలు చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి. ఏఎన్ఆర్ డాన్స్ అప్పట్లోనే హైలెట్గా నిలిచింది.హీరోయిన్ మంజుల కూడ అదరగొట్టేసింది. అలాగే రావు గోపాల్ రావు, సూర్యకాంతం, ఛాయాదేవిలు అందరూ కూడా అద్భుతంగా నటించారు. ఇందులోని డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాయి. వీరితో పాటు సత్యనారాయణ, జగ్గయ్య, రాజాబాబు, ఝాన్సీ తదితరునటీనటులు నటించారు. అయితే ఇందులో ప్రత్యేకమైన పాత్ర లేనటువంటి ఒక నౌకరి పాత్రలో ధూళిపాళ్ల ఎలా నటించారో అప్పటి ప్రేక్షకులు ఆశ్చర్యాన్ని కలిగించిందట.
జగపతి పిక్చర్స్ బ్యానర్ పైన వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అయితే ఈ సినిమా యూట్యూబ్లో ఉంది. అక్కినేని, మంజుల అభిమానులు అయితే ఈ సినిమాని చూడవచ్చు. ఈ చిత్రంలోని నాగేశ్వరరావు బుల్ ఫైట్ ప్రత్యేక ఆకర్షణీయమని చెప్పవచ్చు. ఏఎన్ఆర్ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలలో కూడా నటించారు కానీ ఇలాంటి పాత్రలలో అరుదుగా నటిస్తూ ఉంటారు. బంగారు బొమ్మలు సినిమా అప్పట్లోనే అక్కినేని అభిమానులను తీవ్ర నిరశకు గురి చేసిందనే విధంగా వార్తలు వినిపించాయట. బంగారు బొమ్మల చిత్రాన్ని మూగమనసులు సినిమా లాగా తీయాలనుకున్నారట. కానీ అందులో విఫలమయ్యారు. అప్పటినుంచి ఏఎన్ఆర్ ఇలాంటి సినిమాలకు దూరమయ్యారని అప్పట్లో ఎక్కువగా వార్తలు వినిపించాయి.