సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎప్పుడూ లేని సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. అందుకు ప్రధాన కారణం ఆ సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ హీరోల సినిమాలు ఎక్కువగా థియేటర్లలో విడుదల అవుతూ ఉంటాయి. ఇక సంక్రాంతికి విడుదల అయిన సినిమాలలో కొన్ని సినిమాలకు పెద్దగా గొప్ప టాక్ రాకపోయినా భారీ కలెక్షన్లు వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దానితో పెద్ద పెద్ద సినిమాలను ఎక్కువ శాతం సంక్రాంతి బరిలో నిలపడానికి మేకర్స్ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.

ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండగకి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇలాంటి వాతావరణం నెలకొనే అవకాశాలు కనబడుతున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్గా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర మూవీ ని విడుదల చేయనున్నారు. ఈ సినిమాను జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. అలాగే విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాను కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు రవితేజ హీరోగా "RT 75" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాను సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం ఈ సినిమా సంక్రాంతి బరి నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

బాలయ్య ప్రస్తుతం బాబి దర్శకత్వంలో "NBK 109" అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి బరిలో నిలపబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంటే చిరు , వెంకీ లకు బాక్స్ ఆఫీస్ దగ్గర కఠిన పరిస్థితులు ఎదురయ్యే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: