మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఎప్పటికప్పుడు తీవ్ర నిరాశనే ఎదురవుతూ వస్తుంది. అందుకు ప్రధాన కారణం మూవీ ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తన తండ్రి అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ సినిమా తర్వాత చరణ్ దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాను మొదలు పెట్టాడు.

సినిమా త్వరగా పూర్తి అయ్యి విడుదల అవుతుంది అని చరణ్ అభిమానులు అంతా భావించారు. కానీ అక్కడే అసలు ట్విస్ట్ ఎదురయింది. అప్పటికే శంకర్ "భారతీయుడు 2" షూటింగ్ను మొదలు పెట్టి ఆపివేయడం , ఆ తర్వాత మళ్లీ ఆ సినిమాను తిరిగి ప్రారంభించడంతో ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్లను తెరకెక్కిస్తూ రావడంతో గేమ్ చేంజర్ సినిమా అనుకున్న దాని కంటే డిలే అవుతూ వచ్చింది. ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన చరణ్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ అయింది. మరో పది రోజుల్లో మొత్తం షూటింగ్ కంప్లీట్ కానున్నట్లు శంకర్ "భారతీయుడు 2" విడుదల సమయంలో చెప్పుకొచ్చాడు. ఈ సినిమా బృందం ఈ మూవీ ని డిసెంబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా కూడా ప్రకటించింది.

కొన్ని రోజుల క్రితం వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ బృందం విడుదల చేసిన పోస్టర్లో ఈ సినిమా విడుదల తేదీ లేకపోవడంతో మళ్లీ ఈ సినిమా విడుదల డిసెంబర్ 20 కి ఉంటుందా ... లేదా అనే కొత్త అనుమానాలు చరణ్ అభిమానుల్లో మొదలయ్యాయి. ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా విడుదల ఈ సంవత్సరం ఉంటుందా ... లేదా అనే దానిపై పక్కా క్లారిటీ ఇన్ఫర్మేషన్ రావడం లేదు. దానితో చరణ్ అభిమానులు గేమ్ చేంజర్ సినిమా బృందం పై మళ్ళీ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: