సినిమా పరిశ్రమలు కొంత మంది నటీమణులకు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే మంచి విజయాలు మంచి అవకాశాలు దక్కడం , వారు నటించిన సినిమాలు మంచి సక్సెస్ కావడంతో చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతూ ఉంటారు. కానీ కొంత మంది విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా జరుగుతూ ఉంటుంది. అందం , అభినయం టాలెంట్ అన్ని ఉన్నా కూడా వారు స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లలేరు. అలా అన్నీ ఉన్నా కూడా స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లలేని ముద్దుగుమ్మలలో రితికా సింగ్ ఒకరు. ఈమె విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన గురు సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. అలాగే ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులకు బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కానీ అలా జరగలేదు. గురు సినిమా తర్వాత ఈమెకు అసలు చెప్పుకోదగ్గ తెలుగు సినిమాలలో అవకాశాలే రాగలేదు. దానితో ఈమె కూడా తెలుగు పై కాకుండా ఇతర ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా కొన్ని తమిళ సినిమాలలో నటించిన కూడా అవి భారీ స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలు కాదు.

దానితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈమె అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడిపోయింది. దానితో అందం , అభినయం , టాలెంట్ అన్ని ఉన్నా కూడా ఈమెకు మంచి సినిమాలలో అవకాశాలు రాకపోవడంతో స్టార్ హీరోయిన్ కావాల్సిన లక్షణాలున్న ఈ బ్యూటీ మామూలు నటిగా మిగిలిపోయింది. మరి రాబోయే కాలంలో అయిన ఈమెకు మంచి అవకాశాలు దక్కి మంచి స్థాయికి వెళుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: