యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి ఎన్నో రికార్డులను తన పేరు మీద నెలకొల్పుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ఆఖరుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో హీరోగా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. కాకపోతే ఈ సినిమాలో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరోగా నటించాడు. సోలో హీరోగా జూనియర్ ఎన్టీఆర్ సినిమా విడుదల అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఆఖరి సినిమా అరవింద సమేత.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే అరవింద సమేత తర్వాత సోలో హీరోగా ఎన్టీఆర్ నటించిన దేవర మొదటి భాగం సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా ... ఝాన్సీ కపూర్ ఈ మూవీలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్మూవీ కి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక మలయాళ భాషను మినహాయిస్తే మిగతా అన్ని భాషలకు జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నట్లు తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ఆర్అర్" సినిమా కన్నడ వర్షన్ కి కూడా డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఇక దేవర సినిమా కన్నడ వర్షన్ కి కూడా ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఎన్టీఆర్ "ఆర్ఆర్ఆర్" సినిమా కన్నడ వర్షన్ కి 5 గంటల్లో డబ్బింగ్ చెప్పగా , దేవర సినిమా కన్నడ వర్షన్ కి మాత్రం కేవలం 4 గంటల్లోనే తన డబ్బింగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పుడే డబ్బింగ్ విషయంలో ఆర్ఆర్ఆర్ రికార్డులను ఎన్టీఆర్ బీట్ చేసినట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: