టిల్లు స్క్వేర్ సినిమాతో తనలో ఉన్న మరో యాంగిల్ ని బయట పెట్టిన అనుపమ పరమేశ్వరన్ అప్పటివరకు ఓలెక్క ఆ తర్వాత ఓ లెక్క అన్నట్లు టిల్లు స్క్వేర్ సినిమాతో పూర్తిగా బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది అనుపమ పరమేశ్వరన్. అయితే అలాంటి ఈ హీరోయిన్ కారులో ఆ పని అంటూ ఆమె పరువు మొత్తం తీసేసారు ఓ స్టార్ డైరెక్టర్. మరి ఆయన ఎవరు.. ఎందుకు అనుపమ గురించి అలాంటి మాటలు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. రామ్ పోతినేని, అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో హలో గురూ ప్రేమకోసమే సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ సినిమాలో కలువ కళ్ల సుందరి  ప్రణీత సుభాష్ కూడా నటించింది. కానీ ఈమె సెకండ్ హీరోయిన్ గా నటించగా మెయిన్ హీరోయిన్ గా అనుపమ చేసిన ఈ మూవీ డైరెక్టర్ త్రినాధ రావు నక్కిన సక్సెస్ మీట్ లో పరువు మొత్తం తీసేశారు.. 

హలో గురు ప్రేమకోసమే సక్సెస్ మీట్ లో త్రినాధ రావు నక్కిన మాట్లాడుతూ.. అనుపమ మొదటిసారి దిల్ రాజు ఆఫీస్ కి వచ్చిన సమయంలో జీన్స్ ప్యాంటు షర్టు వేసుకొని భయపడుకుంటూ లోపలికి వచ్చింది అంటూ స్టేజ్ మీదనే అనుపమ ఎలా వచ్చిందో చేసి చూపించారు.అంతేకాదు  అనుపమ గురించి ఇంకా మాట్లాడుతూ.. నేను షూటింగ్ సెట్ కి 7 గంటలకే వచ్చేసేవాడిని. ఆ తర్వాత ఏడున్నర గంటలకు హీరోయిన్ అనుపమ ఓ రోజు కారులో వచ్చింది.ఆ తర్వాత ఎవరో వచ్చారని నేను కార్ దగ్గరికి వెళ్లి చూడగా కారు గ్లాస్ తీయకుండా అనుపమ లోపలే కూర్చుంది.

కానీ నేను అనుపమను గుర్తుపట్టలేదు. సార్ నేను అనుపమని అంటే ముందుగా నువ్వు మేకప్ వేసుకొని రా అమ్మ  అని పంపించాను అంటూ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన స్టేజ్ మీదనే నవ్వులు పూయించారు. అయితే ఈ డైరెక్టర్ మాటలకు అనుపమ మీదికి నవ్వుకున్నప్పటికీ లోలోపల మాత్రం కాస్త ఇన్సల్ట్ గా ఫీల్ అయింది.ప్రస్తుతం ఆ డైరెక్టర్ మాట్లాడిన మాటలు మరోసారి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ వీడియో చూసిన కొంత మంది జనాలు అనుపమ పరువు మొత్తం తీసేసారు అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: