టాలీవుడ్ లో ఒక పెద్ద సినిమా వచ్చింది అంటే చాలు తొలిరోజు కలెక్షన్లు ఎలా ? ఉన్నాయి ... మలి రోజు కలెక్షన్ ఎలా ఉన్నాయి ? ఫస్ట్ వీకెండ్ ఎంత తొలి వారం రోజుల కలెక్షన్లు ఎంత ? ఇండియా కలెక్షన్లు ఎంత ? వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు ఎంత ? వరల్డ్ వైడ్ నెట్ కలెక్షన్లు ఎంత అన్న ఎంక్వైరీలు సహజంగానే మొదలవుతాయి. మీడియాలోనూ ... సోషల్ మీడియాలను ఈ నెంబర్ల గురించి ఒక్కటే చర్చ జరుగుతుంది. ఇందులో చాలా వరకు ఫేక్ నెంబర్లు బయటకు వస్తాయి. ఇలాంటి సాధారణంగా అభిమానుల పేజీలలోనే దర్శనమిస్తూ ఉంటాయి. హీరోల రికార్డుల కోసం భారీ నెంబర్లు ప్రకటించడం కూడా చేస్తూ ఉంటారు.


ఆ తర్వాత అభిమానుల కోసం ఇచ్చామని తర్వాత కవర్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో కలెక్షన్ల మీద ఆరా పెరుగుతుంది.. ఎవరి స్థాయిలో వారు కలెక్షన్ వివరాలు సంపాదిస్తున్నారు. దీంతో టాలీవుడ్ లో కొందరు అందరికన్నా ముందుగా తమకు కావాల్సిన సినిమాల‌కు ఒక విధంగా ... తమకు నచ్చని ... తమకు గిట్ట‌ని సినిమాలకు ఒక విధంగా నెంబర్లు తయారుచేసి సోషల్ మీడియాలో ఎలా పంపాలో అలా పంపిస్తున్నారు. దీంతో ఒరిజినల్ నెంబర్లు ఎవరైనా వేసిన అవి వేస్ట్ అయిపోతున్నాయి.


ఈ విధంగా టాలీవుడ్ లో సినిమాల కలెక్షన్ల లెక్కలలో నాన్న రభ‌స‌ జరుగుతుంది. ఇక త్వరలోనే ఎన్టీఆర్ దేవర సినిమా రాబోతుంది. సహజంగానే ఈ సినిమా కలెక్షన్ల మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పైగా అభిమానుల మధ్య పోటీ అన్నది కూడా ఇక్కడ కీలకం కానుంది. అందుకే ముందుగానే దేవర టీం ఒక విషయం చెప్పేసిందట.. కలెక్షన్ వివరాలు ఎవరికీ వెల్లడించవద్దు అని వార్నింగ్ ఇచ్చినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమకు ఎలాగూ పంపిస్తారు కదా తాము అన్ని లెక్కలు కట్టి సోషల్ మీడియాకు వదులుతామని చెప్పారట.

మరింత సమాచారం తెలుసుకోండి: