ఆండ్రియా జెర్మియా.. ఈ హీరోయిన్ పేరు చెప్తే తెలియని వారు ఉండరు.. ఆండ్రియా ప్రస్తుతం హీరోయిన్ అయినప్పటికీ  ఇండస్ట్రీలోకి మొదట ఎంట్రీ ఇచ్చింది మాత్రం సింగర్ గా.. తమిళ చిత్ర పరిశ్రమలోకి సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత లిరిక్ రైటర్ గా చేసి హీరోయిన్ గా మారిపోయింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంది.ఇక ఆ మధ్యకాలంలో సుచీ లీక్స్ ద్వారా అనిరుధ్, ఆండ్రీయాల మధ్య ఉన్న సీక్రెట్ బంధం బట్టబయలు అయింది.. అయితే ఈ విషయాన్ని వీళ్లు కూడా ఒప్పుకున్నారు. చాలా సంవత్సరాలు ఆండ్రియా అనిరుద్ ఇద్దరూ డేటింగ్ కూడా చేసినప్పటికీ ఏజ్ గ్యాప్ కారణంగా ఇద్దరి మధ్య సెట్ అవ్వలేదు. దాంతో బ్రేకప్ చెప్పుకున్నారు.

అయితే అనిరుధ్ తో బ్రేకప్ తర్వాత మరో నటుడితో  ఆండ్రియా జెర్మియా డేటింగ్ చేసిందట.అయితే విచిత్రం ఏమిటంటే.. ఆ హీరోకి అప్పటికే పెళ్లయిపోయిందట. కానీ ఈ విషయం తెలిసినా కూడా ఆండ్రియా ఆ వ్యక్తితో రిలేషన్ కొనసాగించిందట. కానీ ఆ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నన్ని రోజులు ఆండ్రియా చాలా టార్చర్ అనుభవించిందట. ప్రేమలో పడ్డ సమయంలో బాగానే ఉన్నప్పటికీ రోజులు గడుస్తున్నా కొద్ది ఆయనతో రిలేషన్ చాలా టార్చర్ అనిపించింది.మరీ ముఖ్యంగా ఆయన నన్ను శారీరకంగా పూర్తిగా వాడుకొని చాలా హింసించాడు.

ఆయన టార్చర్ తట్టుకోలేక ఎన్నో రోజులు డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తికి దూరంగా ఉన్నానో అప్పటినుండి నేను ఆ డిప్రెషన్ నుండి కోరుకున్నాను. ప్రస్తుతం అయితే ఆయనకు దూరంగానే ఉన్నా అంటూ సంచలన కామెంట్లు చేసింది ఆండ్రియా జర్మియా. ప్రస్తుతం ఈమె కామెంట్లు నెట్టింట వైరల్ గా మారడంతో ఇంతకీ ఆండ్రియా డేటింగ్ చేసిన ఆ పెళ్లైన నటుడు ఎవరబ్బా అని వెతికే పనిలో పడ్డారు నెటిజన్స్. ఇక ఆండ్రియా 38 ఏళ్ల వయసున్న కూడా వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో రాణిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: