జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. rrr చిత్రం తర్వాత విడుదల కాబోతున్న చిత్రం దేవర. అభిమానులు ఈ సినిమా కోసం భారీ అంచనాలు పెట్టుకున్నారు.
సెప్టెంబర్ 27వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో దేవర సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమా మొదటి భాగమే ఇది రెండవ భాగం కూడ ఉన్నది. ఇటీవలే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జూనియర్ ఎన్టీఆర్ తోపాటు చిత్ర బృందం కూడా పాల్గొంది. ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సినిమా పైన నెమ్మదిగా హైప్ పెరుగుతోంది. ముఖ్యంగా ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. అయితే ఇందులో ఎన్టీఆర్ నటించడానికి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఏకంగా ఈ సినిమా కోసం 30% పెంచినట్లుగా సమాచారం.
RRR చిత్రానికి గాను జూనియర్ ఎన్టీఆర్ 45 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు దేవరా సినిమాకి 60 కోట్ల రూపాయల వరకు రంజాన్ రేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఈ విషయమైతే ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్ 5 కోట్ల రూపాయలు.. సైఫ్ అలీఖాన్ 10 కోట్ల రూపాయలు.. శ్రీకాంత్ 50 లక్షలు.. ప్రకాష్ రాజ్ 1.5 తదితర నటీనటులు తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇది మొదటి భాగానికి ఇంత తీసుకున్నారా అనే విషయం ఇప్పుడు తెలియాల్సి ఉంది.