తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో గా కొనసాగుతుంది బిగ్ బాస్. ప్రేక్షకులు ఎప్పుడూ చూడని రీతిలో సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందించి ప్రతి సీజన్లో కూడా టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే 7 సీజన్లను సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో.. ఇక ఇప్పుడు ఎనిమిదవ సీజన్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తూ ఉంది అని చెప్పాలి. ఎప్పటి లాగానే ప్రతి సోమవారం నామినేషన్స్ ఇక ప్రతి ఆదివారం ఎలిమినేషన్స్ జరుగుతూ ఇక బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచేస్తోంది.


 అయితే హౌస్ లోకి కంటెస్టెంట్  గా వెళ్లిన వారిలో ఎవరు లోపల ఉండాలి ఎవరు బయటకు రావాలి అన్న విషయాన్ని ప్రేక్షకులు తేలుస్తూ ఉంటారు. ఇక తమ అభిమాన కంటెస్టెంట్లకు ఓట్లు వేసి ఇక హౌస్ లోనే ఉండేలా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తక్కువ ఓట్లు వచ్చిన వారు ఇక హౌస్ నుంచి బయటికి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలా ప్రేక్షకులదే తుది నిర్ణయం గా మారిపోతూ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఎలిమినేషన్ విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు వ్యవహరించే తీరు ప్రేక్షకులు అందరికీ కూడా కోపం తెప్పిస్తూ ఉంటుంది.


 ఇక ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్లో కూడా రెండో వారం ఎలిమినేషన్ ఇలా ప్రేక్షకులకు అస్సలు నచ్చడం లేదు. రెండో వారం శేఖర్ భాష  ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చాడు అన్న విషయం తెలిసిందే. నామినేషన్స్ లో చివర్లో ఓం ఆదిత్య, శేఖర్ భాషా ఉండగా.. తక్కువ ఓట్లు వచ్చిన వారిని నాగార్జున ఎలిమినేట్ చేయాల్సి ఉంది. కానీ ఇలాంటి సమయంలో ఇంటి సభ్యుల ఓటింగ్ తీసుకున్నారు. ఇంటి సభ్యులందరూ కూడా ఆదిత్య ఓం హౌస్ లో ఉండాలి అని ఓటు వేశారు. దీంతో ప్రేక్షకుల ఓటింగ్ ని పట్టించుకోకుండా చివరికి శేఖర్ భాషను హౌస్ నుంచి బయటికి పంపించాడు నాగార్జున. దీంతో ఇలాంటి ఎలిమినేషన్ ఊహించలేదని.. ఇలాంటప్పుడు ఇక ప్రేక్షకులు వేసిన ఓట్లకి  ఎక్కడ విలువ ఉంది అంటూ ఎంతో మంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: