ఇటీవల కాలంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమా ఏది అంటే అందరూ 'కల్కి'మూవీ పేరు చెబుతారు. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను కూడా తిరగరాసింది ఈ మూవీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులు అందరినీ అబ్బురపరిచి కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళింది అనడంలో సందేహం లేదు.


 నాగ్ అశ్విన్ తన క్రియేటివిటీ తో మైథాలజీకి, సైన్స్ ఫిక్షన్ జోడించి ఫ్యూచర్స్టిక్ అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం కూడా ప్రేక్షకులను మంత్రముక్తులను చేసింది. కాగా ఈ మూవీలో ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించగా.. దీపికా పదుకొనే కీలకపాత్రలో కనిపించింది. అదే సమయంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అశ్వద్ధామ లాంటి కీలకపాత్రలో నటించి ఆకట్టుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితేఈ మూవీ మొత్తంలో అశ్వద్ధామ పాత్ర ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది.


 మొదట అశ్వద్ధమ పాత్ర ఎంతో యంగ్ గా కనిపిస్తుంది. ఇక తర్వాత అమితాబ్ పాత్ర ముసలి వ్యక్తి లాగానే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే యువ అశ్వద్ధామ పాత్ర ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అయితే ఇలా యువ అశ్వద్ధామను డిజైన్ చేసేందుకు మూవీ టీమ్ స్పెషల్ స్వాప్ టెక్నాలజీని వాడిందట. అమితాబ్ యువకుడిగా చేసినప్పటి సినిమాల నుంచి ముఖ కవళికల్ని మొదట తీసుకున్నారు. అనంతరం యుద్ధ సన్నివేశాలు అన్నీ కూడా డూప్ తో చేయించి.. అమితాబ్ ముఖ కవళికల్ని ఇక దానితో కలిపారు. ఈ క్రమంలోనే యువ అశ్వద్ధామను ఎలా డిజైన్ చేశారు అనేదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: