ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయి జగన్మోహన్ రెడ్డి సతమతమవుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో... పార్టీకి సంబంధించిన కీలక నేతలు వైసీపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. దాదాపు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పదిమంది వరకు రాజీనామా చేశారు.

 

మొన్న ఇద్దరు రాజ్యసభ సభ్యులు మోపిదేవి అలాగే మస్తాన్రావు... కూడా వైసిపికి రాజీనామా చేసి... బయటికి వెళ్లారు. వాళ్లు ఏ క్షణమైనా తెలుగుదేశం లేదా బిజెపిలో చేరే ఛాన్స్ ఉంది. అదే సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మొన్న జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చారట. తనకు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా సపోర్ట్ చేయడం లేదని... ఒంగోలు రీకౌంటింగ్.. విషయంలో వైసిపి తనకు ఎక్కడ సపోర్ట్  గా నిలవలేదని బాలినేని శ్రీనివాస్ రెడ్డి మొకం మీద చెప్పేశారట.

 

బాలినేని శ్రీనివాస్ రెడ్డి త్వరలోనే జనసేన పార్టీలోకి వెళ్తున్నారని సమాచారం అందుతుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీలో కీలకంగా ఉన్న విడదల రజిని.. కూడా జగన్మోహన్ రెడ్డికి వెన్నుపోటు పొడిచేలా.. కనిపిస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తొందర్లోనే విడదల రజిని...కూడా రాజీనామా చేస్తూ ఉందని... సమాచారం. ఇందులో భాగంగానే వైసీపీ కీలక నేత బాలినేని  శ్రీనివాసరెడ్డి తో రహస్యంగా మంతనాలు...జరిపారట రజిని.

 

వాస్తవంగా తెలుగుదేశం పార్టీ నుంచి తన రాజకీయ అరంగేట్రం చేశారు విడదల రజిని. ఆ తర్వాత వైసీపీలో చేరి.. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఆరోగ్యశాఖ మంత్రిగా కూడా పనిచేశారు రజిని. అయితే మొన్నటి ఎన్నికల్లో గుంటూరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయారు రజిని. అయితే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో చేరితే.. ఆ పార్టీలోకి రజిని కూడా వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: