నందమూరి నట సింహం బాలకృష్ణ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. బాలయ్య ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్ లో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. అఖండ మూవీ కంటే ముందు కొన్ని అపజయాలను ఎదుర్కొన్న బాలయ్య "అఖండ" సినిమా దగ్గర నుండి వరుసగా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ వస్తున్నాడు. అఖండ తర్వాత బాలయ్య వరుసగా వీర సింహా రెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు.

ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాలయ్య హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత బోయపాటి దర్శకత్వంలో అఖండ 2 మూవీ ని చేయబోతున్నాడు. ఇలా అద్భుతమైన స్పీడ్ లో ఫుల్ జోష్లో కెరియర్ను బాలయ్య ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే బాలయ్య కెరియర్లో ఒక డ్రీమ్ ప్రాజెక్టు ఉంది. కానీ అది ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు సెట్ కావడం లేదు. అది ఏమిటి అనుకుంటున్నారా. అసలు విషయం లోకి వెళితే ... బాలయ్య కొన్ని సంవత్సరాల క్రితం సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆదిత్య 369 అనే టైమ్ ట్రావెలర్ కాన్సెప్ట్ మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసింది.

ఇకపోతే ఈ సినిమాకు కొనసాగింపుగా ఓ మూవీ ని తీయాలి అని బాలకృష్ణ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితం సంగీత శ్రీనివాస్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఆదిత్య 369 మూవీ కి కొనసాగింపుగా ఓ మూవీ కూడా రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది ఇప్పటి వరకు సెట్ కాలేదు. మరి రాబోయే రోజుల్లో బాలకృష్ణ "ఆదిత్య 369" మూవీ కి కొనసాగింపుగా మరో మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: