యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల నుండి మాత్రమే కాకుండా అనేక ఇతర ఇండస్ట్రీలకు సంబంధించిన వ్యక్తులలో కూడా మంచి గుర్తింపు ఉంది. ఎన్టీఆర్ ఆఖరుగా ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కి ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ లభించింది. తాజాగా ఎన్టీఆర్ , కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే.

జాన్వి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ మూవీలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మూవీ మొదటి భాగాన్ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ వస్తున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన జాన్వి కపూర్ కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా దేవర మూవీ లో నటించడానికి గల కారణాలను చెప్పుకొచ్చింది. తాజాగా జాన్వీ కపూర్ మాట్లాడుతూ ... నాకు మొదట దేవర సినిమాలో అవకాశం వచ్చినప్పుడు నేను ఆ విషయాన్ని కరణ్ జోహార్ కి చెప్పాను.

దానితో ఆయన తెలుగు సినిమాలలో అవకాశం వచ్చిందా ... అని అడిగాడు. అవును అని అన్నాను. ఏ హీరో సినిమాలో అని నన్ను ప్రశ్నించాడు. దానితో నేను జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాను. వెంటనే దానికి కరణ్ జోహార్ ఆయన గొప్ప నటుడు. ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ సినిమాకు ఓకే చెప్పేసేయ్. నీ కెరియర్ చాలా బాగుంటుంది అని సలహా ఇచ్చాడు. దానితో నేను ఈ సినిమాకు ఓకే చెప్పాను. కరణ్ చేయమనకపోతే నేను దేవర సినిమా చేసేదాన్ని కాదు అని జాన్వీ కపూర్ తాజాగా చెప్పుకచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: