సినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన కథతో మరొకరు సినిమా చేయడం అనేది చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు అయినటువంటి రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో జూనియర్ ఎన్టీఆర్ , జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో రామ్ చరణ్ సినిమాలు చేస్తున్నారు. మరి ఆ సినిమాలు ఏవి అనే వివరాలు తెలుసుకుందాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కథను కొరటాల మొదట రామ్ చరణ్ కు చెప్పినట్లు కానీ ఆయన కొన్ని కారణాల వల్ల ఈ సినిమా కథను రిజెక్ట్ చేసినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఆ తర్వాత ఇదే కథను అల్లు అర్జున్ కి కొరటాల వివరించగా , ఆయన కూడా ఈ స్టోరీ ని రిజెక్ట్ చేసినట్లు దానితో కొరటాలసినిమా కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించగా ఆయన ఓకే చేసినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరి కొంత కాలం లోనే బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది.

ఇకపోతే బుచ్చిబాబు ఈ కథతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమా చేయాలి అనుకున్నాడట. కానీ ఆయన రిజెక్ట్ చేయడంతో రామ్ చరణ్ కు ఈ స్టోరీ చెప్పడం , రామ్ చరణ్ కు ఆ కథ బాగా నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది. ఇలా రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన కథతో జూనియర్ ఎన్టీఆర్ , జూనియర్ ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో చరణ్ సినిమా చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: