టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ గురించి అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ జీవితం పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో బెస్ట్ పెర్ఫర్మ్ ఇచ్చిన కీర్తికి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసినదే. ఆమె ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ మూవీస్ పై కూడా ఫోకస్ పెట్టింది. కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆడపాదడపా చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు హిందీలో వరుణ్ ధావన్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. అయిచే ఇటీవల మహానటి కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రఘు తాత’. ఈ సినిమాను హోంబళే ఫిల్మ్స్ బ్యానర్ మీద విజయ్ కిరగందూర్ నిర్మించగా.. సుమన్ కుమార్ దర్శకత్వం వహించడం జరిగింది.

విషయం ఏమిటంటే... ఈ మూవీకి ఆడియెన్స్ థియేటర్లో మంచి రెస్పాన్స్‌ను ఇచ్చినప్పటికీ జనాలలోకి బాగా వెళ్లలేదనే చెప్పుకోవాలి. కాగా ఇప్పుడు ఈ సినిమాకు ఓటీటీలో అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. అవును, ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. సెప్టెంబర్ 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంటోంది. వైవిధ్య‌మైన పాత్ర‌లు, క‌థాంశంతో రూపొందిన ‘రఘు తాత’ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

ఇకపోతే కథ పరంగా చూస్తే గనుక, న‌మ్మిన దాని కోసం నిల‌బ‌డే స్వ‌తంత్య్ర భావాలున్న అమ్మాయి పాత్ర‌లో కీర్తి సురేష్ అద్భుతమైన నటన కనబరిచింది. ఈ క్రమంలోనే విడుద‌లైన 24 గంట‌ల్లోనే ఈ చిత్రానికి 50 మిలియ‌న్ స్ట్రీమింగ్ రావ‌టం కొసమెరుపు. 1960 బ్యాగ్ డ్రాప్లో హిందీ వ్యతిరేక ఉద్యమం అనే రాజకీయ అంశం చుట్టూ కొనసాగుతూ ఉంటుంది ఈ స్టోరీ. రాజకీయంతోపాటు ఈ మూవీలో లవ్ స్టోరీ కూడా చొప్పించారు దర్శకుడు. ఇందులో కీర్తితోపాటు ఎంఎస్ భాస్కర్, రవీంద్ర విజయ్, దేవదర్శిని, ఆనంద్ సామి, రాజీవ్ రవీంద్రనాథన్ కీలకపాత్రలు పోషించారు. తమిళంలో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ లో కూడా అదే స్థాయిలో ఆడడం విశేషం. అయితే తెలుగులో రిలీజైన ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: