స్టార్ హీరోయిన్ తమన్నా ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. చాలామంది హీరోయిన్లు సౌత్,నార్త్ ఇండస్ట్రీలో  రాణించడం కష్టం అనుకుంటారు.కానీ తమన్నా మాత్రం అటు నార్త్ ఇటు సౌత్ రెండు ఇండస్ట్రీలను కవర్ చేస్తూ అవకాశం వస్తే చిన్న పాత్ర అయినా సరే ఓకే చెబుతోంది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఐటెం సాంగ్ లకు పెట్టింది పేరుగా మారిపోతుంది. రీసెంట్ గా తమన్నా స్త్రీ 2 లో చేసిన ఐటమ్ సాంగ్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పై మరో హీరోయిన్ అక్కసు వెల్లగక్కింది. తమన్నా డబ్బు కోసం కకృత్తి పడి ఎంతకైనా దిగజారుతుంది అంటూ ఆమె చేసిన కామెంట్లు వైరల్ గా నిలిచాయి. మరి ఇంతకీ తమన్నాని అంతలా అవమానించింది ఎవరో కాదు కాజల్ అగర్వాల్..

 అయితే ఈ హీరోయిన్ ఓ స్టార్ హీరో సినిమాల అవకాశం వస్తే ఆయన కంటే నా వయసు చాలా చిన్నది అని రిజెక్ట్ చేసిందట. అయితే ఇదే విషయాన్ని ఆ డైరెక్టర్ మీరు చిరంజీవితో చేశారు కదా. మరి ఈ హీరో సినిమాలో చేస్తే ఏంటి అని అడగగా..నో నేను చేయను.. ఆయన పక్కన నేను హీరోయిన్గా సెట్ అవ్వను అని చెప్పిందట. అంతేకాదు నేను డబ్బు కోసం కకృత్తి పడి ఎలాంటి సినిమా నైనా ఎలాంటి హీరో పక్కనైనా చేయడానికి రెడీగా లేను.నేను అందరిలాంటి హీరోయిన్ కాను అంటూ చెప్పిందట.

అయితే ఇందులో తమన్నాను విమర్శించినట్టు ఎక్కడ కనిపించింది అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ విషయం చెప్పే కంటే ముందే తమన్నా ఓ ఇంటర్వ్యూలో నాకు ఆకర్షణీయమైనా రెమ్యూనరేషన్ ఇస్తే చిన్న పాత్రలో నైనా చేయడానికి రెడీగా ఉన్నాను అంటూ పబ్లిక్ గా చెప్పింది.అయితే ఇదే విషయాన్ని ఆసరాగా చేసుకున్న కాజల్ తమన్నాని పరోక్షంగా నేను ఆ హీరోయిన్ లాగా డబ్బు కోసం కక్కుర్తి పడి ఎలాంటి పాత్రలో అయినా చేసే రకాన్ని కాదు అంటూ  ఆ డైరెక్టర్ కి చెప్పిందట.దీంతో కాజల్ మాటలు విన్న చాలా మంది తమన్నా ఫ్యాన్స్ కాజల్ కావాలనే తమన్నాని టార్గెట్ చేసింది అని మాట్లాడుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: