తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న హీరోలు దర్శకులలో కొంత మంది కి మంచి బాండింగ్ ఉంటుంది. అలా టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , స్టార్ దర్శకుల్లో ఒకరు అయినటువంటి కొరటాల శివ మధ్య కూడా మంచి బాండింగ్ ఉంటుంది. వీరి కాంబినేషన్లో మొదటగా శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా మహేష్ బాబు కు కొరటాల శివ కు మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత వీరి కాంబోలో భరత్ అనే నేను సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మూవీ విజయం సాధించడంతో ఈ కాంబో క్రేజ్ మరింతగా పెరిగింది. ఇకపోతే వీరిద్దరి మధ్య విజయాలు మాత్రమే కాదు మంచి బాండింగ్ కూడా ఉంది. ఒకా నొక ఇంటర్వ్యూ లో భాగంగా కొరటాల శివ మాట్లాడుతూ ... మహేష్ బాబు నా కోసం ఏదైనా చేస్తాడు. ఒక సారి మహేష్ బాబు నాతో మాట్లాడుతూ ... నువ్వు ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు , నీకు ఇంకా ఏ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు నా దగ్గరికి రా. అది ఎలాంటి సమయమైనా , ఏ అవసరం అయినా నీకు కోసం చేస్తాను. ఏ మాత్రం ఆలోచించను అని అన్నాడు అని కొరటాల శివ ఓ ఇంటర్వ్యూ లో బాగంగా చెప్పుకొచ్చాడు.

ఇక కొరటాల శివ చెప్పిన మాటలతోనే అర్థం అవుతుంది కొరటాల కి మహేష్ బాబు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడు అనేది , అలాగే వీరిద్దరి మధ్య ఎంత స్నేహ బంధం ఉందో అనేది కూడా తెలుస్తుంది. తాజాగా కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల కానుంది. మహేష్ బాబు తన తదుపరి మూవీ ని రాజమౌళి దర్శకత్వం లో చేయబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: