అందాల ముద్దుగుమ్మ ప్రియాంక అరుల్ మోహన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ నటి నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఈ నటికి మాత్రం మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. 

ఆ తర్వాత ఈ బ్యూటీ శర్వానంద్ హీరోగా రూపొందిన శ్రీకారం మూవీ లో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఇలా తెలుగులో నటించిన రెండు సినిమాలు కూడా బోల్తా కొట్టడంతో ఈ బ్యూటీ తమిళ సినీ పరిశ్రమ వైపు ఆసక్తి చూపించింది. అందులో బగంగ్ ఈమె తమిళ్లో ఈమె నటించిన చాలా సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. మళ్ళీ ఈమె తెలుగు సినిమాలలో నటించడానికి ఆసక్తిని చూపిస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఈమె నటించిన సరిపోదా శనివారం సినిమా థియేటర్లలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం ఈ నటి పవన్ హీరోగా రూపొందుతున్న ఓజి మూవీలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటి వరకు చాలా సినిమాలలో నటించిన ఈ నటి స్కిన్ షో కు మాత్రం చాలా వరకు దూరంగా ఉంటూ వస్తుంది. సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ ఎక్కువగా అందాలను ఆరబోయడం లేదు. తాజాగా ప్రియాంక చీరకట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో క్యూట్ లుక్స్  తో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

prm