సాంప్రదాయ పద్ధతిలో చీరకట్టులో మెరిసిన ఈ బాలీవుడ్ బ్యూటీని ఇప్పటికీ తెలుగు సినీ ప్రేక్షకులు మర్చిపోలేకపోతున్నారు. సీతారామం సినిమా మంచి సక్సెస్ కావడంతో సినీ ఇండస్ట్రీలో మంచి డిమాండ్ పెరిగింది. స్టార్ హీరోల సినిమాల్లోనూ మృణాల్ ఠాకూర్ వరుసగా సినిమా అవకాశాలను అంది పుచ్చుకుంటుంది. అంతకుముందే బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్గా గడుపుతున్న ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంటుంది.
తాజాగా మృనాల్ ఠాకూర్ కు సంబంధించిన ఓ వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా తన బ్రేకప్ స్టోరీని మృణాల్ చెప్పుకొచ్చింది. తనకు గత ఏడు నెలల క్రితమే ఓ వ్యక్తితో బ్రేకప్ జరిగిందని అయినా అస్సలు బాధపడట్లేదని వెల్లడించింది. ఓ పాడ్ కాస్ట్ లో తన ప్రేమ విషయం, బ్రేకప్ విషయాలు మాట్లాడింది. మనకు సూట్ అయ్యే వ్యక్తి మన జీవితంలో వచ్చేవరకు వచ్చి.... వెళ్ళిపోయే వాళ్ళు వెళుతూనే ఉంటారని సంచలన కామెంట్స్ చేసింది.
మీకు ఎవరు సెట్ అవుతారో నీకు మాత్రమే తెలుస్తుంది. ఇక నా జీవితంలో గతంలో ఓ వ్యక్తితో డేటింగ్ చేశాను. అయితే సినీ నటితో అతనికి రిలేషన్ ఎందుకు నచ్చలేదో తెలియదు కానీ పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానని చెప్పాడు. దాంతో ఇద్దరం విడిపోయాము. అంతెందుకు గత ఏడు నెలల క్రితం కూడా ఒకరితో నాకు బ్రేకప్ అయ్యింది అంటూ మృనాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇక మృణాల్ అభిమానులు ఈ విషయం తెలిసి ఇంత అందమైన అమ్మాయిని వదులుకున్న అన్ లక్కీ ఫెలో ఎవరో అని చర్చించుకుంటున్నారు.