మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో థియేటర్స్ లో రాబోతుంది. ఇక ఈ భారీ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి ఊహించని విధంగా ఆడియెన్స్ లో నెగిటివ్ టాక్ ఎక్కువ వచ్చింది. కానీ దేవర ట్రైలర్ ని ఒక్కసారి బిగ్ స్క్రీన్స్ పై చూసిన వారికి మాత్రం ఆ ఒపీనియన్ మారుతుంది అని చెప్పొచ్చు. డెఫినెట్ గా బిగ్ స్క్రీన్స్ పై ఎక్స్ పీరియన్స్ మొబైల్ స్క్రీన్స్ లో రాదు. అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కి ఎన్టీఆర్ మాస్

 ప్రెజెన్స్ కొరటాల టేకింగ్ ఇవన్నీ బిగ్ స్క్రీన్స్ పై చూసిన వాళ్ళు ఇప్పుడు సర్ప్రైజ్ అవుతున్నారు. మరి మేకర్స్ అప్పుడే ట్రైలర్ రిలీజ్ కి థియేటర్స్ లో కూడా లాంఛ్ చేసి ఉంటే బాగుండేది.  ఇక దేవర  సినిమాకు అనిరుద్ రవిచందర్ సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అనిరుధ్ పై జూనియర్ ఎన్టీఆర్  ఇంటర్వ్యూ లో ప్రశంసల వర్షం కురిపించాడు. అనిరుద్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ… దేవర సినిమాను అనిరుధ్ బాగా అర్థం చేసుకున్నాడు. దేవర కోసం అతను సృష్టించిన మ్యూజిక్ ఇంటర్నేషనల్ సినిమాల రేంజ్ లో ఉంది. ప్రేక్షకులు అంతకంటే ఎక్కువ ఆశించడం కూడా తక్కువ కాదు. ఆడియన్స్

 ఎంత కోరుకుంటారో అంతకన్నా ఎక్కువే ఇచ్చాడు. ఎదో ఒకరోజు అనిరుద్ హాలీవుడ్ ఇంటర్నేషనల్ మూవీస్ లో భాగమవుతాడని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. అయితే ఎన్టీఆర్ అన్న ఈ మాటలు చూసి నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.అయితే ఎన్టీఆర్ మ్యూజిక్ పై అనిరుధ్  పై చేసిన వ్యాఖ్యలకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందంగానే ఉన్నా, చాలా వరకు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు విమర్శకులైతే అనిరుధ్ నిజంగా దేవరకు ఎన్టీఆర్ పొగిడిన స్థాయిలో మ్యూజిక్ అందించాడా అన్న వాదన వినిపిస్తుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: