దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ రాబోతోన్న సంగతి తెలిసిందే. SSMB29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాను ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా టైటిల్‌ SSRMB29గా పేరు మార్చారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రాబోతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం మహేష్‌ బాబు కూడా పూర్తిగా మేకోవర్‌ అయ్యాడు. ఇది వరకు ఎన్నడు చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇది భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ అని చక్కన్న ఎప్పుడో ఈ మూవీపై సాలీడ్‌ అప్‌డేట్‌ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటుంది. డిసెంబర్‌లో ఈ

 సినిమా రెగ్యూలర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టనుంది. తొలి షెడ్యూల్‌ విదేశాల్లో జరగునుందట. ఫారిన్‌ అడవుల్లో భారీ ఛేజింగ్‌, యాక్షన్‌ సీక్వెన్స్‌లో తెరకెక్కించనున్నట్టు సమాచారం. మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రానుంది. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో జేమ్స్ బాండ్ తరహాలో రానుందని,టైటిల్ ఇదే అని అలా ఒకేటేమిటి రకరకాల ఊహాగానాలు రోజుకొకటి వినిపించాయి. టాలీవుడ్ లో కనీసం షూటింగ్ కూడా స్టార్ట్ చేయకుండా ఇంతటి భారీ హైప్ రాబట్టిన ఏకైక సినిమా మహేశ్ రాజమౌళి సినిమా అనే చెప్పాలి. రాజమౌళి సినిమా కోసం లాంగ్ హెయిర్,

 బియర్డ్ తో ఉన్న మహేశ్ బాబు లుక్ తెగ వైరల్ గా మారింది. కాగా రానున్న రాజమౌళి పుట్టినరోజు కి SSMB29 కి సంబందించిన న్యూస్ ఉంటుందని తెలుస్తోంది.
 డిసెంబరు లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తో ప్రారంభించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ జర్మనీలో మొదలుపెట్టనున్నట్టు యూనిట్ సభ్యుల సమాచారం. అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా సినిమాను పక్కా ప్రణాళికతో రూపొందించేలా అందుకు తగినట్టుగా ప్లాన్ రూపొందించారని టాక్. త్వరలోనే యూనిట్ సభ్యులందరికి వర్క్ షాప్ నిర్వహిస్తారని యూనిట్ సభ్యులకు సమాచారం అందించారని వినికిడి. రెగ్యులర్ షూట్ ఎప్పుడు స్టార్ట్ చేసిన సరే ఈ సినిమానుఎట్టి పరిస్థితుల్లో 2028లో రిలీజ్ చేస్తారని యూనిట్ కీలక సభ్యులు తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: