ఈమధ్య ఇండియన్ సినిమాల నుంచి కూడా పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతూ బాగానే ఆకట్టుకుంటున్నాయి. సినిమా స్టోరీ బాగుంటే చిన్న పెద్దా అని తేడా లేకుండా అందరూ హీరోలు కూడా రిలీజ్ చేస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. ఒకవేళ థియేటర్లో తెలుగు వర్షన్ లో మాత్రం సినిమాలు విడుదలై సక్సెస్ అయిన ఇతర భాషలలో ఆకట్టుకోలేకపోయినా ఓటీటీ ద్వారా సక్సెస్ అయి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇలా ఈ రెండిటిని దృష్టి పెట్టుకొని చాలామంది తెలుగు దర్శక నిర్మాతలు హీరోలు కూడ తమ చిత్రాలను పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేస్తున్నారు.


బలమైన కథతో సినిమాని తెరకెక్కిస్తే నార్త్ ఆడియన్స్ కూడ సినిమాలకు బ్రహ్మరథం పడతారని ఇప్పటికి ఎన్నో చిత్రాలు నిరూపించాయి. అయితే ఈ ఏడాది టాలీవుడ్ నుంచి ఏకంగా నాలుగు బడ పాన్ ఇండియా చిత్రాలు థియేటర్లోకి రిలీజ్ కాబోతున్నాయి. అందులో మోస్ట్ వాంటెడ్ చిత్రం పుష్ప-2 ఈ సినిమా డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా 1000  క్లబ్లో అడుగుపెడుతుందని మేకర్స్ పూర్తి ఎఫెక్ట్ పెట్టి పని చేస్తున్నారు. ఆ తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరో ధనుష్ కాంబినేషన్లో వస్తున్న కుభేర చిత్రం. ఈ చిత్రం డిసెంబర్ 13 లేదా 20వ తేదీ థియేటర్ల తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.


మూడవ చిత్రం నాగచైతన్య నటించిన తండెల్ ఈ సినిమా డిసెంబర్ 20న రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అప్పుడు రిలీజ్ కాకపోతే జనవరి 13న సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు. నాలుగవ సినిమా రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్.. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల చేసేలా చిత్రబృంద ప్లాన్ చేస్తున్నారు. నిర్మాత దిల్ రాజు కూడా ఈ సినిమాని అప్పుడే రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారు. మరి డైరెక్టర్ శంకర్ ఎలాంటి ఔట్ పుట్ ఇస్తారో చూడాలి. మరి డిసెంబర్ తో టాలీవుడ్ లెక్క మార్చి దమ్మున్న హీరో ఎవరు అవుతారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: