- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .
- 1980 పీరియాడిక్ నేపథ్యం లో దేవర స్టోరీ
- కసితో తెరకెక్కించిన కొరటాల శివ
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మోసస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. దివంగత అతిలోక అందాల సుందరి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. దక్షిణ భారతదేశంలో జాన్వీ కపూర్ నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావటం విశేషం. ఆచార్య లాంటి భారీ డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల శివ చాలా కసితో దేవర సినిమాను తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్న ఈ సినిమా ఐదు భాషలలో తెరకెక్కుతుంది.
ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న దేవర.. మరో 12 రోజులలో థియేటర్లలోకి దిగనుంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు.. తెలుగు సినిమా అభిమానులు అందరూ ఈ సినిమాపై మంచి అంచనాలతో ఉన్నారు. ఈ సినిమా యూనిట్ సాలిడ్ ప్రమోషన్లలో బిజీ బిజీగా ఉన్నారు. దీంతో ప్రమోషన్లు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. అయితే ఈ ప్రమోషన్స్‌లో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ బయటకు వస్తున్నాయ. ఈ సినిమా కథ ఎప్పుడు జరుగుతుంది అనేది రివీల్ అయింది.
దేవర సినిమా 1980 నుంచి 1990 మధ్యకాలంలో జరిగే కథగా ఇప్పుడు రివిల్ అయింది. దీంతో దేవర సినిమా కూడా పిరియాడిక్ బాక్ డ్రాప్‌లోనే రాబోతుంది అని చెప్పాలి. మరోపక్క దేవర సినిమా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కింది అని కూడా పలు రూమర్లు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమా.. కాదా.. అన్నది సినిమా రిలీజ్ అయ్యాక కానీ క్లారిటీ రాదు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా.. మరో బాలీవుడ్ హీరో బాబీ డియోల్ కూడా విలన్ గా నటిస్తున్నారు.