- బ‌న్నీ - త్రివిక్ర‌మ్ కాంబోలో 4వ సినిమా
- భారీ స‌బ్జెక్ట్ రెడీ అయ్యింద‌ని చెప్పిన బ‌న్నీ వాస్‌
- డిసెంబ‌ర్ తో పుష్ప 2 ప‌నులు పూర్తి
- ఏప్రిల్ నుంచి సెట్స్ మీద‌కు వెళ్లే ఛాన్స్

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) .

పుష్ప 2 తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఏ సినిమా చేస్తారని ఇప్పటివరకు అందరిలోనూ సందేహం ఉంది. రకరకాల పుకార్లు కూడా వచ్చాయి. తాజాగా తమిళ డైరెక్ట‌ర్ అట్లీ పేరు కూడా తెర‌మీద‌కు వచ్చింది. అయితే ఇప్పట్లో అల్లు అర్జున్ , అట్లీ కాంబినేషన్ ఉండదు అని తెలిసింది. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. మాటల మంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తాడని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన జులాయి, సన్ఆ ఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో మూడు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.


ఈ క్రమంలోనే మరోసారి త్రివిక్రమ్ బన్నీ కాంబినేషన్ రిపీట్ కాబోతుందని తెలుస్తోంది.  త్రివిక్ర‌మ్ క‌ని వినీ ఎరుగని భారీ సబ్జెక్ట్‌ తయారు చేశారని.. దానికి ప్రీ ప్రొడక్షన్ పనులు ఏడాదికి పైగా పడతాయని.. హీరో బన్నీ సన్నిహితుడు బన్నీ వాస్‌ గతంలో చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు. అది అద్భుతమైన సినిమా అవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే ప్రాజెక్టును ఏప్రిల్ నుంచి మొదలుపెట్టబోతున్నారని టాలీవుడ్ లో పుకార్లు నడుస్తున్నాయి.


డిసెంబర్ వరకు పుష్ప 2 పనులు ఉండనే ఉంటాయి. రెండు మూడు నెలలు విశ్రాంతి తీసుకుంటే.. ఆ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ సినిమా కోసం ఏప్రిల్ నుంచి సెట్స్ మీదకు వెళతారని తెలుస్తోంది. ఏదైనా అద్భుతాలు జరిగితే మినహా బన్నీ తర్వాత సినిమా.. త్రివిక్రమ్‌తో అని దాదాపు క్లారిటీ వచ్చేసింది. ఇక ఈ సినిమాపై కూడా కనివిని ఎరుగని రేంజ్‌లో అంచనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: