నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటించిన యాక్షన్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ 'సరిపోదా శనివారం' బాక్సాఫీస్ బరిలో దుమ్ము దులుపుతోంది.‌ విడుదలైన మూడు వారాలలోపే 100 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా ఓటీటీ విడుదల గురించి ఇప్పుడు ఓ అప్డేట్ వచ్చేసింది.సరిపోదా శనివారం మూవీతో నాని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఎస్ జే సూర్య, నాని మాస్ యాక్టింగ్ కు వివేక్ ఆత్రేయ టేకింగ్ యాడ్ అవ్వడంతో.. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈ మూవీ ఓటీటీ డేట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 26 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 26 నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. దాంతో మూవీని థియేటర్లలో మిస్ అయిన వారు ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు.  ఇక ఇప్పుడు వారి వెయిటింగ్ కు పుల్ స్టాప్ పడబోతోంది.కాగా.. సరిపోదా శనివారం మూవీ 100 కోట్ల కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇందులో నానికి జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ నటించి మెప్పించింది. ఇక నాని ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. శైలేష్ కొలను డైరెక్షన్ లో ‘హిట్ 3’ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత సుజిత్ తో ఓ చిత్రం చేయాల్సి ఉంది. వీటితో పాటుగా దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో కూడా ఓ మూవీని కమిట్ అయ్యాడు. ఇక తాజాగా సైమా 2024 అవార్డ్స్ లో దసరా మూవీలో నటనకు గాను ఉత్తమ నటుడిగా అవార్డును అందుకున్నాడు. అలాగే నాని నటించిన హాయ్ నాన్న చిత్రానికి నాలుగు విభాగాల్లో, దసరా మూవీకి సైతం నాలుగు విభాగాల్లో అవార్డులు దక్కాయి.ఇదిలావుండగా 'సరిపోదా శనివారం'తో బాక్సాఫీస్ దగ్గర నాని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.‌ ఆయన ఖాతాలో ముచ్చటగా మూడో 100 కోట్ల సినిమా చేరింది. నాని ఖాతాలో ఫస్ట్ 100 కోట్ల సినిమా 'ఈగ'. అయితే... అందులో ఆయనది అతిథి పాత్ర మాత్రమే.‌ నాని క్యారెక్టర్ మరణించిన తర్వాత ఆ ఆత్మ ఈగలో చేరడంతో సినిమా అంతా ఈగ మీద నడిచింది.‌ ఆ తర్వాత దసరాతో నాని భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా కూడా 100 కోట్ల వసూళ్లు సాధించింది. ఇప్పుడు 'సరిపోదా శనివారం'తో మూడో 100 కోట్ల సినిమా అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి: