ట్రైలర్ ఏ మాత్రం అంచనాలు అందుకోలేదని.. ట్రైలర్లో కొత్తదనం లేదంటూ కథనాలు ప్రచురించింది. తాజాగా దేవర సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న వేళ సినిమా ప్రమోషన్లు కూడా సరిగా జరగటం లేదని.. సినిమాకు అనుకున్నంత హైప్ లేదని.. విష ప్రచారం మొదలుపెట్టేసింది. ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ నార్త్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ నార్త్‌లో ఎక్కువగా ప్రచారం చేస్తూ తెలుగు మీడియాను, తెలుగు ప్రమోషన్లను సరిగా పట్టించుకోవడంలేదని వరుసగా కథనాలు ప్రచారం చేస్తోంది.
పైగా కపిల్ శర్మ షోలో ఎన్టీఆర్‌ను కమెడియన్లా చూపించారని ప్రచురించడంతోపాటు.. తెలుగులో కుర్ర హీరోలు జొన్నలగడ్డ, సిద్దు విశ్వక్సేన్ తో.. ఎన్టీఆర్, కొరటాల ఇంటర్వ్యూ రికార్డు చేయించడం కూడా ఎన్టీఆర్ ఇమేజ్, ఎన్టీఆర్ క్రేజ్ ను తగ్గించేదని చెప్పే ప్రయత్నం చేసింది. ఏది ఏమైనా గత 20 రోజులుగా దేవర సినిమాను టార్గెట్‌గా చేసుకొని సదరు తెలుగు మీడియా.. ప్రముఖ పత్రిక, వెబ్సైట్ భారీగా నెగిటివ్ స్టోరీలు అయితే చేస్తున్నారు. అయితే వీళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం.. లేదా యాడ్స్ ఇవ్వలేదని కోపంతో ఇలా చేస్తున్నారా.. అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.