ఎందుకంటే తెలుగు ఎంటర్టైన్మెంట్ చానల్స్‌లో సినిమా ప్రమోషన్ల కోసం సెలబ్రిటీలు వస్తే చాలా గౌరవంగా వారిని ట్రీట్ చేస్తారు. కానీ.. కపిల్ శర్మ షోలో అలా జరగలేదు. ఆ విషయం ఆ ప్రోమో చూస్తుంటేనే తెలుస్తుంది. ఇక టాలీవుడ్‌లో కుర్ర హీరోలు సిద్దు, విశ్వక్‌సేన్‌లతో ఎన్టీఆర్.. కొరటాలను ఇంటర్వ్యూ చేయించడం అభిమానులకు సైతం షాక్ ఇచ్చేలా ఉంది. ఇలా యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ చూడటానికి కాస్త ఎంటర్టైనింగ్ కనిపించినా.. ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి..? అసలు దేవర సినిమా రేంజ్ ఏంటి..? వారితో ఇంటర్వ్యూ ఏంటి..? కేవలం యూట్యూబ్ ఛానల్‌కు వ్యూస్ తప్పితే దేవర సినిమాకు ఇది ఏ విధంగా ఉపయోగపడతాయి..? అసలు సినిమాలో విషయం ఉండాలి కదా.. అనే కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.
ఇవన్నీ కూడా ఎన్టీఆర్ ఇమేజ్‌ను డ్యామేజ్ కలిగించే ప్రయత్నంలో కనిపిస్తోందని.. కావాలని ఎన్టీఆర్ రేంజ్‌ను తగ్గించే ప్రయత్నం అని సోషల్ మీడియాలో ఒక్కటే చర్చ జరుగుతుంది. ఆల్రెడీ ముంబైలో జరిగిన ఈవెంట్లో జై జూనియర్ ఎన్టీఆర్ నినాదాలకు డబ్బులు ఇచ్చి మరీ జనాలను కూడగట్టారని అపవాదులు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇక తెలుగు మీడియా కంటే నార్త్ మీడియాకే దేవర టీం ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం.. తెలుగు మీడియాలో కూడా ఒకరిద్దరు చాలు అన్నట్టుగా వ్యవహరించడంతో దేవరకు సరైన రీతిలో ప్రమోషన్లు జరగటం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇవన్నీ జూనియర్ ఎన్టీఆర్ రేంజ్‌ని కావాలని దిగజార్చే ప్రయత్నాలు అన్న బాధ అభిమానులలో సైతం కనిపిస్తోంది.