టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ ఎప్పుడూ కూడ విభిన్నమైన కథలతో ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో థియేటర్ల ఈ ఏడాది సందడి చేస్తూ ఉన్నారు సుహాస్. సుహాస్ సినిమా అంటే కచ్చితంగా ఆ చిత్రంలో ఏదైనా ఒక ప్రత్యేకత ఉంటుంది అనేలా ముద్ర పడిపోయింది. ముఖ్యంగా జనక అయితే గనుక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సుహాస్ కొన్ని కారణాల చేత ఆ సినిమాని వాయిదా వేశారు.


ఇప్పుడు తాజాగా గొర్రె పురాణం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైన సుహాస్ గత కొన్ని నెలలుగా ఈ చిత్రాన్ని బాగానే ప్రమోషన్ చేశారు. ఈ చిత్రాన్ని బాబి డైరెక్షన్ లో తెరకెక్కించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో తాజాగా చిత్ర బృందం ట్రైలర్ ని విడుదల చేయగా ట్రైలర్లో కాస్త ఎగ్జైటింగ్ గా అనిపించేలా లేదనీ అభిమానులు వాపోతున్నారు. గొర్రె పురాణం సినిమాతో రిస్క్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది సినిమా చూస్తేనే కదా తెలిసేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


ఇక గొర్రె పురాణం ట్రైలర్ విషయానికి వస్తే.. గొర్రె జైల్లో ఉండడమేంటి అక్కడి నుంచి తప్పించుకోవడం ఏంటి అనే కథాంశంతో మొదలవుతుంది.. అయితే ఆ తర్వాత ఆ గొర్రె ఒక చోటు నుంచి తప్పించుకొని మరి కల్లు తాగుతూ ఉంటుంద. గొర్రె పురాణం కథలోని ఒక ట్విస్ట్ మొదలవుతుంది.. గొర్రె చేసిన పని వల్ల కొన్ని మతాల ప్రజలు గొడవకు దిగుతూ ఉంటారు.. ఇలా ఇంతలోని జైల్లో దుస్తులతో సుహాన్ గొర్రెను పట్టుకొని పరిగెడుతూ ఉన్నట్టుగా చూపించారు. సుహాస్ కోర్టులో చూపే డైలాగు ఆసక్తికరంగా ఉన్నది.. మొత్తానికి ఈ గొర్రె వల్ల సుహానికి సక్సెస్ అందుకుంటారా లేదా అనే విషయం చూడాలి మరి. ఈ సినిమా సెప్టెంబర్ 20న రిలీజ్ కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: