కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. ఇటీవలే ట్రైలర్ కూడా రిలీజ్ చేసారు. దేవర సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  ఇక దేవర సినిమాకు బిజినెస్ కూడా భారీగా జరుగుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే అన్ని చోట్ల థియేట్రికల్ సేల్ జరిగిపోయిందని, ఓటీటీ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. తాజాగా సమాచారం ప్రకారం తెలుగులో దేవర సినిమాకు భారీ బిజినెస్ జరిగిందట. నైజాంలో 42 కోట్లకు, ఆంధ్రలో 55 కోట్లకు, సీడెడ్ లో 20 కోట్లకు దేవర థియేట్రికల్ రైట్స్ అమ్ముడు పోయాయని సమాచారం. రిలీజ్ డేట్

 దగ్గర పడుతుండటంతో ప్రమోషన్‌ స్పీడు పెంచింది దేవర టీమ్‌. ముంబైలో ట్రైలర్ చేసిన యూనిట్‌, వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజాగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దేవర టీమ్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో కొన్ని ఇంట్రస్టింగ్ సీక్రెట్స్ రివీల్ అయ్యాయి. దేవర నేపథ్యం విషయంలో ముందు నుంచే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది యూనిట్‌. ఈ సినిమా  సముద్రం నేపథ్యంలో జరిగే పీరియాడిక్‌ ట్రైబల్‌ యాక్షన్ డ్రామా అని ఎనౌన్స్‌మెంట్ టైమ్‌లోనే క్లారిటీ ఇచ్చింది. లేటెస్ట్ ఇంటర్వ్యూలో కథా కథనాలకు సంబంధించి విషయాలు రివీల్ చేశారు. ఈ 80, 90ల మధ్య జరిగే కథ అని, వాళ్ల పూర్వికుల

 ఆయుధాలను పూజించే నాలుగు గ్రామాల ప్రజల మధ్యే జరిగే సంఘటనల నేపథ్యంలోనే ఈ చిత్రం ను రూపొందించినట్టుగా చెప్పారు. అంతేకాదు ఈ కథ ఒకే కుటుంబం మధ్య జరుగుతుందని చెప్పటంతో సైఫ్‌, ఎన్టీఆర్‌ది ఒకే ఫ్యామిలీ అన్న సీక్రెట్ కూడా రివీల్ అయ్యింది. రెగ్యులర్ కమర్షియల్ ల్లో హీరో అంటే ప్రజలకు ధైర్యంగా కనిస్తాడని, కానీ దేవర మాత్రం ఆ ప్రజలకు భయం కలిగించేలా ఉంటాడని చెప్పారు. నిడివి విషయంలోనూ క్లారిటీ ఇచ్చింది యూనిట్‌. దాదాపు 3 గంటల లెంగ్త్‌తో ఈ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: